కన్నుల పండువగా అమ్మవారి తెప్పోత్సవం
ABN , Publish Date - Oct 01 , 2025 | 11:36 PM
వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి వారి ఆలయంలో అమ్మ వారి తెప్పోత్సవం అత్యంత కన్నుల పండుగగా కొనసాగింది.
వేములవాడ కల్చరల్, అక్టోబరు 1 (ఆంధ్రజ్యోతి): వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి వారి ఆలయంలో అమ్మ వారి తెప్పోత్సవం అత్యంత కన్నుల పండుగగా కొనసాగింది. రాజన్న ఆలయ ధర్మగుండంలో బుధవారం ఆది దంపతులు పడవపైన విహరిస్తుంటే భక్తులు ఓం నమఃశివాయ నామస్మరణలో మునిగి తేలారు. వేములవాడ రాజన్న ఆలయంలో చేపడుతున్న శ్రీదేవి నవరాత్రోత్సవాల్లో భాగంగా పది రోజులపాటు విశేషపూజలు అందుకున్న అమ్మవారు మంగళవాయిద్యాల మధ్య తెప్పోత్సవం అత్యంత వైభవంగా కొనసాగింది. అమ్మవారి తెప్పోత్సవాన్ని వీక్షించేందుకు ఆలయ ధర్మగుండం వద్దకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలి రావడంతో ధర్మగుండం భక్తజన సంద్రంగా మారిపోయి కనిపించింది. తెప్పోత్సవం కార్యక్రమానికి ఈవో రమాదేవి హజరై అమ్మవారిని దర్శించుకున్నారు.