చేపపిల్లల ఉత్పత్తి కేంద్రాన్ని కబ్జాల నుంచి కాపాడాలి
ABN , Publish Date - May 02 , 2025 | 11:49 PM
చేపపిల్లల ఉత్పత్తి కేంద్రాన్ని కబ్జాల నుంచి కాపాడాలని తెలంగాణ మత్స్యకారులు, మత్స్య కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లెల్లెల బాలకృష్ణ ప్రభుత్నాన్ని డిమాండ్ చేశారు.
భగత్‌నగర్, మే 2(ఆంధ్రజ్యోతి): చేపపిల్లల ఉత్పత్తి కేంద్రాన్ని కబ్జాల నుంచి కాపాడాలని తెలంగాణ మత్స్యకారులు, మత్స్య కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లెల్లెల బాలకృష్ణ ప్రభుత్నాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం నగరంలోని కోతిరాంపూర్ జిల్లా కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం 2025-26 సంవత్సరానికి మత్స సొసైటీలకు ఉచిత చేప పిల్లలకు బదులుగా మత్స్యసోసైటీ జల వనరులకు సరిపడే చేప పిల్లల కొనుగోలుకు సొసైటీ ఖాతాల్లో నగదు జమ చేయాలన్నారు. జిల్లా కేంద్రంలోని జింకలపార్కు పక్కన ఉన్న చేపపిల్లల ఉత్పత్తి కేంద్రాన్ని కబ్జాల నుంచి కాపాడి నిధులు, సిబ్బందిని కేటాయించాలన్నారు. అనంతరం జిల్లా అదనపు కలెక్టర్ లక్ష్మీకిరణ్‌కు వినతిపత్రం అందించారు. ఈకార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు పిట్టల వెంకన్న, జిల్లా ప్రధాన కార్యదర్శి జునగరి గణేష్, నూనె శేఖర్, పప్పు సదానందం, జునగిరి లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ మత్స్యకారులు, మత్స్య కార్మిక సంఘం నాయకులు పాల్గొన్నారు.