తొలి విడత లెక్క తేలింది..
ABN , Publish Date - Dec 04 , 2025 | 01:24 AM
పంచాయతీ ఎన్నికల్లో తొలి విడత పోరు లెక్క తేలింది.
(ఆంధ్రజ్యోతి సిరిసిల్ల)
పంచాయతీ ఎన్నికల్లో తొలి విడత పోరు లెక్క తేలింది. రాజన్న సిరిసిల్ల జిల్లాలో 260 సర్పంచ్, 2268 వార్డు స్థానాలకు ఎన్నికలను మూడు దశల్లో నిర్వహించడానికి సర్వం సిద్ధం చేశారు. ఇందులో ఏకగ్రీవాలు మినహాయించి ఎన్నికల ప్రక్రియ నిర్వహించడానికి అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేసింది. తొలి విడతలో రుద్రంగి, వేములవాడ, వేములవాడ రూరల్, కోనరావుపేట, చందుర్తి మండలాల్లో 85 సర్పంచులు, 748 వార్డులకు సంబంధించి బుధవారం నామినేషన్ల ఉపసంహరణ ఘట్టం ముగిసింది. ఈనెల 11న పోలింగ్ నిర్వహించనున్నారు. ఏకగ్రీవాలతో పదవులు దక్కించుకున్న వారు సంబరాల్లో ఉంటే బరిలో నిలిచిన అభ్యర్థులు ప్రచార బాట పట్టారు. ఓటర్లను తమకు అనుకూలంగా ఉండే విధంగా అన్ని మార్గాలను అన్వేషించడం మొదలుపెట్టారు. తొలి విడత ఎన్నికల్లో 76 సర్పంచ్ స్థానాల్లో 295 మంది, 519 వార్డులకు 1377 మంది అభ్యర్థులు రంగంలో ఉన్నారు, తొమ్మిది మంది సర్పంచ్, 229మంది వార్డు సభ్యులుగా ఏకగ్రీవమయ్యారు. మలి విడతలో బోయిన్‌పల్లి, ఇల్లంతకుంట, తంగళ్లపల్లి మండలాల్లో 88 సర్పంచులు, 758 వార్డుల స్థానాలకు వచ్చిన నామినేషన్ల పరిశీలన పూర్తి చేశారు. ఐదు సర్పంచ్, 94 వార్డులు స్థానాలకు ఏకగ్రీవమయ్యాయి. ప్రకటించాల్సి ఉంది. బరిలో ఉండే అభ్యర్థులు ఉపసంహరణల ప్రయత్నాలు మొదలుపెట్టారు. బుధవారం తుది విడతలో ఎల్లారెడ్డిపేట, వీర్నపల్లి, ముస్తాబాద్, గంభీరావుపేట మండలాల్లో 87 సర్పంచు, 762 వార్డులకు ఎన్నికల నోటిఫికేషన్ జారీచేసి నామినేషన్ల స్వీకరణ ప్రారంభించారు. దీంతో జిల్లాలో పంచాయతీ ఎన్నికల కోలాహలం మొదలైంది.
తొలి విడతలో 9 మంది సర్పంచ్, 229 వార్డులు ఏకగ్రీవం
జిల్లాలోని తొలి విడతలు ఐదు మండలాల్లో 85 సర్పంచ్ స్థానాల్లో 9 మంది అభ్యర్థులు, 229 మంది వార్డు సభ్యులు ఏకగ్రీవం అయ్యారు. రుద్రంగి మండలంలో 10 గ్రామపంచాయతీలు ఉండగా, గిరిజన తండాల్లో ఏడు గ్రామపంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. అడ్డబోరు తండ సర్పంచ్‌గా గూగులోతు మంజుల, గైదీగుట్ట తండా సర్పంచ్‌గా ఇస్లావత్ కిషన్, వీరునితండా సర్పంచ్‌గా గుగులోతు మంజుల, చింతామణితండా సర్పంచిగా గుగులోతు సింధుజ, బడితండా సర్పంచ్‌గా మాలోతు రాందాస్, రూప్లానాయక్ తండా సర్పంచ్‌గా భూక్య జవహర్‌లాల్, సర్పంచ్ తండా సర్పంచ్‌గా మాలోత్ రజితలతో పాటు వార్డు సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కోనరావుపేట మండలంలో ఊరుతండా సర్పంచ్‌గా ఇస్లావత్ మంజుల, కుమ్మరిపేటతండా సర్పంచ్‌గా మాలోతు మంజులలు వార్డు సభ్యులతో సహా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. తంగళ్ళపల్లి మండలం బాలమల్లుపల్లెలో సర్పంచ్‌గా యాద ఎల్లయ్య, వేణుగోపాల్‌పూర్ సర్పంచ్‌గా జూపల్లి రమాదేవితో పాటు వార్డు సభ్యులు ఏకగ్రీవమయ్యారు. ఇల్లంతకుంట మండలం చిక్కువానిపల్లె కళ్యాణ్, తిప్పాపూర్ సర్పంచిగా బొల్లవేణి మంజుల, వార్డు స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. కేశన్నపల్లెలో సర్పంచ్ పోతరాజు చంటి ఏకగ్రీవం కాగా ఆరు వార్డులో ఏకగ్రీవమయ్యాయి. అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. గ్రామపంచాయతీ వార్డుల్లో 229 మంది అభ్యర్థులు ఏకగ్రీవం కాగా, ఇందులో రుద్రంగి మండలంలో 52 మంది, వేములవాడలో 14 మంది, చందుర్తి లో 29 మంది, వేములవాడ రూరల్‌లో 42 మంది, కోనరావుపేటలో 92 మంది సభ్యులు ఏకగ్రీవమయ్యారు. రెండో విడతలో ఐదు గ్రామపంచాయతీలు ఏకగ్రీవయ్యాయి, తంగళ్ళపల్లి, ఇల్లంతకుంటలో సర్పంచ్‌లో ఐదుగురు ఏకగ్రీవంగా వార్డు సభ్యులు 94 మంది ఏకగ్రీవమయ్యారు.
తొలి విడత బరిలో సర్పంచ్ అభ్యర్థులు 295 మంది, వార్డు అభ్యర్థులు 1377 మంది..
రాజన్న సిరిసిల్ల జిల్లాలో తొలి విడతలో ఐదు మండలాల్లో 85 సర్పంచ్ స్థానాలు ఉండగా తొమ్మిది స్థానాల్లో ఏకగ్రీవం కాగా 76 గ్రామపంచాయతీలు 295 మంది సర్పంచ్ అభ్యర్థులు, 229 మంది వార్డు సభ్యులు ఏకగ్రీవం కాగా, 519 వార్డుల్లో 1377 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు.
మండలం సర్పంచ్ వార్డులు
రుద్రంగి 10 91
వేములవాడ 47 218
వేములవాడ రూరల్ 52 262
కోనరావుపేట 122 459
చందుర్తి 64 347
మొత్తం 295 1377
రెండో విడతలో 432 సర్పంచ్.. 1677 వార్డులకు అభ్యర్థులు
పంచాయతీ ఎన్నికల్లో పోటీకి సిద్ధపడ్డ అభ్యర్థులు రెండో విడతలో బుదవారం నామినేషన్ల పరిశీలన పూర్తి చేశారు. మూడు మండలాల్లో 88 సర్పంచులు, 758 వార్డు సభ్యుల స్థానాలకు ఉండగా సర్పంచ్ స్థానాల్లో 432 మంది అభ్యర్థులు, 1677 వార్డు ఆభ్యర్థులు ఉన్నారు. ఉపసంహరణలకు ఈనెల 9వ తేది వరకు గడువు ఉంది.
రెండో విడత బరిలో అభ్యర్థులు
మండలం సర్పంచ్ వార్డులు
బోయిన్‌పల్లి 190 533
ఇల్లంతకుంట 112 597
తంగళ్లపల్లి 130 547
మొత్తం 432 1677
తుదివిడతలో తొలి రోజు 147 సర్పంచ్.. 268 వార్డులకు నామినేషన్లు
గ్రామపంచాయతీ తుదివిడత ఎన్నికల సర్పంచ్ వార్డు సభ్యుల నామినేషన్ల పర్వం మొదలైంది. తుది విడతలో నాలుగు మండలాల్లో 87 సర్పంచులు, 762 వార్డు సభ్యుల స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. బుధవారం ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేసి 29 కేంద్రాల ద్వారా నామినేషన్లను స్వీకరించారు. తొలిరోజు సర్పంచ్ స్థానాలకు 147 నామినేషన్లు, 268 వార్డు సభ్యుల స్థానాలకు నామినేషన్లు వచ్చాయి.
తుది విడతలో తొలి రోజు నామినేషన్ల
మండలం సర్పంచ్ వార్డులు
ఎల్లారెడ్డిపేట 56 89
వీర్నపల్లి 11 10
ముస్తాబాద్ 45 100
గంబీరావుపేట 35 69
మొత్తం 147 268