Share News

‘ఎర్లీబర్డ్‌’’ అంతంతే..

ABN , Publish Date - May 09 , 2025 | 01:02 AM

ఆస్తి పన్ను వసూళ్లలో రాజన్న సిరిసిల్ల జిల్లా గ్రామపంచాయతీల్లో రాష్ట్రస్థాయిలో మొదటి స్థానంలో నిలిచింది. అలాగే సిరిసిల్ల, వేములవాడ రెండు మున్సిపాలిటీలు సైతం ముందు వరుసలోనే నిలిచాయి. గ్రామపంచాయతీలతో పోల్చుకుంటే మున్సిపాలిటీల్లో 2024-2025 ఆస్తి పన్నుల వసూళ్లలో రూ.9.60 కోట్ల వరకు వసూలు చేశారు. సిరిసిల్ల మున్సిపాలిటీల్లో 96.99శాతం, వేములవాడలో 85.14శాతం పన్నులు వసూలు చేశారు. మున్సిపాలిటీల్లో ప్రతి సంవత్సరం ఎర్లీ బర్డ్‌ పేరిట ఐదు శాతం రిబేట్‌తో రాయితీ స్కీంలో ఆస్తి పన్ను చెల్లించే అవకాశాన్ని ప్రభుత్వం ఇస్తూ వస్తోంది.

‘ఎర్లీబర్డ్‌’’ అంతంతే..

- 2024-25 ఆస్తి పన్ను వసూళ్లతో ఖజానా కళకళ

- సిరిసిల్ల, వేములవాడ మున్సిపాలిటీల్లో రూ.9.60 కోట్లు ఇంటి పన్ను వసూలు

- ఎర్లీబర్డ్‌ రాయితీపై అనాసక్తి..

- ఈనెల 7తో ముగిసిన గడువు

(ఆంధ్రజ్యోతి సిరిసిల్ల)

ఆస్తి పన్ను వసూళ్లలో రాజన్న సిరిసిల్ల జిల్లా గ్రామపంచాయతీల్లో రాష్ట్రస్థాయిలో మొదటి స్థానంలో నిలిచింది. అలాగే సిరిసిల్ల, వేములవాడ రెండు మున్సిపాలిటీలు సైతం ముందు వరుసలోనే నిలిచాయి. గ్రామపంచాయతీలతో పోల్చుకుంటే మున్సిపాలిటీల్లో 2024-2025 ఆస్తి పన్నుల వసూళ్లలో రూ.9.60 కోట్ల వరకు వసూలు చేశారు. సిరిసిల్ల మున్సిపాలిటీల్లో 96.99శాతం, వేములవాడలో 85.14శాతం పన్నులు వసూలు చేశారు. మున్సిపాలిటీల్లో ప్రతి సంవత్సరం ఎర్లీ బర్డ్‌ పేరిట ఐదు శాతం రిబేట్‌తో రాయితీ స్కీంలో ఆస్తి పన్ను చెల్లించే అవకాశాన్ని ప్రభుత్వం ఇస్తూ వస్తోంది. ఇందులో భాగంగా మార్చి 31 వరకు సాధారణ పన్నుల వసూలు ప్రక్రియ పూర్తికాగా, ఏప్రిల్‌ 30వరకు ఐదు శాతం రాయితీతో పన్నులు చెల్లించే అవకాశాన్ని ఇచ్చింది. ఏప్రిల్‌ 30వరకు కూడా ఆశించిన మేరకు పన్నుల వసూలు లేకపోవడంతో మే 7 వరకు అవకాశాన్ని పొడిగించినా రాయితీపై అంతంత మాత్రంగానే స్పందన వచ్చింది.

ఫ ఎర్లీ బర్డ్‌లో రూ.3.77 కోట్ల వసూలు

రాజన్న సిరిసిల్ల జిల్లాలో సిరిసిల్ల, వేములవాడ రెండు మున్సిపాలిటీల్లో ప్రభుత్వ, ప్రైవేటు 2025-26 ఆస్తి పన్నులకు సంబంధించి సిరిసిల్ల మున్సిపాలిటీలో 23,778 భవనాలకు సంబంధించి రూ 9.75 కోట్లు లక్ష్యంగా ఉంది. ఇందులో 5 శాతం రాయితీని 5,117 ఇండ్లకు సంబంధించి వినియోగించుకున్నారు. 2.37 కోట్లు వసూలు కాగా 24.31 శాతంగా ఉంది. వేములవాడలో 15,002 భవనాలకు సంబంధించి 20.11 కోట్లు కాగా, 3,567 భవనాలకు సంబంఽధించి రూ.1.40 కోట్లు వసూలు చేశారు. గత ఆర్థిక సంవత్సరం ప్రభుత్వ ఆస్తి పన్నులు మినహా ఇళ్లకు సంబంధించిన పన్నులో సిరిసిల్ల మున్సిపాలిటీలో 23,487 ఇళ్లకు రూ.6.36 కోట్ల లక్ష్యానికి రూ.6.13కోట్లతో 96.99 శాతంతో ముందంజలో నిలిచారు. వేములవాడ మున్సిపాలిటీలో రూ.4.07కోట్లు లక్ష్యం కాగా రూ.3.47 కోట్లు వసూలు చేసి 85.14 శాతంతో నిలిచారు.

ఫ పన్నుల వసూళ్లలో పల్లెలు అదర్శం..

పన్నుల వసూళ్లలో పల్లెలు అదర్శంగా నిలిచాయి. 2024-25 మార్చి 31వరకు ఆస్తి పన్నుల వసూళ్లలో రాజన్న సిరిసిల్ల జిల్లా రాష్ట్రస్థాయిలోనే ప్రథమంగా నిలిచింది. జిల్లాలో 260 గ్రామపంచాయతీల పరిధిలో వంద శాతం పన్నుల లక్ష్యాన్ని 99 శాతం పూర్తి చేశారు. జిల్లాలోని 12 మండలాల్లోని గ్రామపంచాయతీల్లో ఆస్తి పన్నుల్లో పాత బకాయిలతో కలిపి రూ.7 కోట్ల 21 లక్షల 42 వేల 291 వసూలు లక్ష్యం ఉండగా రూ.7 కోట్ల 12 లక్షల 27 వేల 901 వసూలు చేశారు. కేవలం రూ.9 లక్షల 15వేల 390 మాత్రమే బకాయిలు ఉన్నాయి. జిల్లాలో 12 మండలాల్లో 8 మండలాలు వంద శాతం వసూలు పూర్తి చేశారు. వంద శాతం లక్ష్యం సాధించిన మండలాల్లో చందుర్తి, కోనరావుపేట, ముస్తాబాద్‌, రుద్రంగి, వీర్నపల్లి, ఎల్లారెడ్డిపేట, వేములవాడ, వేములవాడ రూరల్‌ మండలాలు ఉన్నాయి. 99 శాతంలో బోయినపల్లి, ఇల్లంతకుంట మండలాలు ఉండగా తంగళ్లపల్లి 98 శాతం, గంభీరావుపేట 91 శాతంతో ఉన్నాయి. పన్నుల వసూళ్లలో బోయినపల్లి మండలంలో 23 గ్రామ పంచాయతీల్లో 51,65,364 రూపాయలకు 51,18,846 రూపాయలు వసూలు చేశారు. చందుర్తి మండలంలో 19 గ్రామపంచాయతీల్లో రూ.49,54,330కు వసూలు రూ.44,96,966, ఇల్లంతకుంట మండలంలో 35 గ్రామ పంచాయతీల్లో రూ.53,52,978కు వసూలు రూ.52,74,624, గంభీరావుపేట మండలంలో 22 గ్రామపంచాయతీల్లో రూ.70,02,546కు వసూలు రూ.63,88,255, కోనరావుపేట మండలంలో 28 గ్రామపంచాయతీల్లో రూ.44,82,537కు వసూలు రూ.44,96,966, ముస్తాబాద్‌ మండలంలో 22 గ్రామపంచాయతీల్లో రూ.1,07,02,265కు వసూలు రూ.1,06,73,103, రుద్రంగి మండలంలో పది గ్రామపంచాయతీల్లో రూ.29,59,690కు వసూలు రూ.29,47,630, తంగళ్లపల్లి మండలంలో 30 గ్రామపంచాయతీల్లో రూ.88,33,109కు వసూలు రూ.86,52,434, వీర్నపల్లి మండలంలో 17 గ్రామపంచాయతీల్లో రూ.18,40,706కు వసూలు రూ.18,42,898, వేములవాడ మండలంలో 11 గ్రామపంచాయతీల్లో రూ.71,70,096కు వసూలు రూ.71,71,250, వేములవాడ రూరల్‌ మండలంలో 17 గ్రామపంచాయతీల్లో రూ.24,70,871కు వసూలు రూ.24,71,668, ఎల్లారెడ్డిపేట మండలంలో 26 గ్రామపంచాయతీల్లో రూ.1,12,08,799కు రూ.1,12,27,998 వసూలు చేశారు.

Updated Date - May 09 , 2025 | 01:02 AM