బకాయిలను విడుదల చేయాలి
ABN , Publish Date - Oct 31 , 2025 | 11:37 PM
రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ విరమణ చేసిన వారికి ఇవ్వాల్సిన బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ రిటైర్డు ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ (రేవా) ఆధ్వర్యంలో శుక్రవారం మౌనదీక్ష నిర్వహించారు.
కరీంనగర్ టౌన్, అక్టోబరు 31 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ విరమణ చేసిన వారికి ఇవ్వాల్సిన బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ రిటైర్డు ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ (రేవా) ఆధ్వర్యంలో శుక్రవారం మౌనదీక్ష నిర్వహించారు. అనంతరం ఇందిరాగాంధీ విగ్రహానికి వినతి పత్రం సమర్పించారు. అనంతరం రేవా ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు కోహెడ చంద్రమౌళి మాట్లాడుతూ ప్రభుత్వ ఉద్యోగులు రిటైర్ అయి 19 నెలలు గడుస్తున్నా ప్రభుత్వం నుంచి రావలసిన బెనిఫిట్స్ ఇంతవరకు చెల్లించ లేదన్నారు. దీంతో ఉద్యోగ విమరణ పొందినవారు అనేక ఇబ్బందులకు గురవుతున్నారని, ఎన్నిసార్లు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసినా స్పందించక పోవడంతో ఇందిరాగాంధీ వర్ధంతి సందర్భంగా మౌన దీక్ష చేపట్టి తమ నిరసన వ్యక్తం చేశామన్నారు.రిటైర్డు ఉద్యోగ, ఉపాధ్యాయులకు జీపీఎఫ్, టీఎస్ జీయల్‌ఐ, లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్, కమ్యూటేషన్, గ్రాట్యూటీ తదితర బకాయిలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. లేకపోతే హైదరాబాద్‌లో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలను చేపడతామని చంద్రమౌళి హెచ్చరించారు. 2024 మార్చి నుంచి ఉద్యోగ విరమణ పొందిన ఉద్యోగులు, ఉపాధ్యాయులకు రావలసిన బకాయిలు అందక ఇప్పటి వరకు 20 మంది ఉద్యోగ, ఉపాధ్యాయులు చనిపోయారన్నారు. ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు ప్రతినెలా 700 కోట్లు విడుదల చేస్తే ఇప్పటి వరకు బకాయిలు మొత్తం తీరేవన్నారు. కార్యక్రమంలో ఉపాఽధ్యక్షులు గద్దె జగదీశ్వరాచారి, కత్రోజు ప్రభాకర్, కోశాధికారి కనపర్తి దివాకర్, జిల్లా కమిటీ సభ్యులు బూరుగుపల్లి రవీందర్, పాలోజు రవీందర్, సిరిసిల్ల జిల్లా ఉపాధ్యక్షులు వంగ సుధాకర్, కె.వెంకటరాములు, గోగుల రామన్న పాల్గొన్నారు.