Share News

బకాయిలు విడుదల చేయాలి

ABN , Publish Date - Oct 30 , 2025 | 12:12 AM

ఫీజు రీయింబర్స్‌మెంట్‌, స్కాలర్‌షిప్‌ బకాయిలు వెంటనే విడుదల చేయకపోతే రాష్ట్రాన్ని రణరంగంగా మారుస్తామని గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మెన్‌ పొన్నం అనిల్‌కుమార్‌ హెచ్చరించారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌, స్కాలర్‌షిప్‌ బకాయిలను వెంటనే చెల్లించాలని డిమాండ్‌ చేస్తూ బీఆర్‌ఎస్వీ ఆధ్వర్యంలో కలెక్టరేట్‌ ఎదుట బుధవారం ధర్నా నిర్వహించారు.

బకాయిలు విడుదల చేయాలి

సుభాష్‌నగర్‌, అక్టోబరు 29 (ఆంధ్రజ్యోతి): ఫీజు రీయింబర్స్‌మెంట్‌, స్కాలర్‌షిప్‌ బకాయిలు వెంటనే విడుదల చేయకపోతే రాష్ట్రాన్ని రణరంగంగా మారుస్తామని గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మెన్‌ పొన్నం అనిల్‌కుమార్‌ హెచ్చరించారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌, స్కాలర్‌షిప్‌ బకాయిలను వెంటనే చెల్లించాలని డిమాండ్‌ చేస్తూ బీఆర్‌ఎస్వీ ఆధ్వర్యంలో కలెక్టరేట్‌ ఎదుట బుధవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో తుగ్లక్‌ పాలన నడుస్తుందన్నారు. ముఖ్యమంత్రి విద్యాశాఖను తనవద్దే పెట్టుకొని ఎలాంటి సమీక్షలు నిర్వహించకుండా నియంత పాలన కొనసాగిస్తున్నాడని విమర్శించారు. ముఖ్యమంత్రి ఇప్పటికైనా స్పందించి బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. అనంతరం జిల్లా కో ఆర్డినేటర్‌ ద్యావ మధుసూదన్‌రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులతో పెట్టుకున్న ఏ ప్రభుత్వం బాగుపడలేదన్నారు. కార్యక్రమంలో మార్కెట్‌ కమిటీ చైర్మెన్‌ రెడ్డవేణి మధు, బండారపు అజయ్‌కుమార్‌, చుక్కా శ్రీనివాస్‌, బొంకూరి మోహన్‌, ఆరె రవి, గంగాధర చందు, నారదాసు వసంత్‌, వడ్లకొండ పరుశురామ్‌, రవితేజ, మున్నా, బండ వేణు, ధీరజ్‌, పబ్బతి శ్రీనివాస్‌రెడ్డి, ఆవుల తిరుపతి, ఒడ్నాల రాజు పాల్గొన్నారు.

Updated Date - Oct 30 , 2025 | 12:12 AM