నెరవేరుతున్న పేదల సొంతింటి కల..
ABN , Publish Date - Sep 27 , 2025 | 12:40 AM
కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో పేదింటి సొంతింటి కల నెరవేరుతోందని వేములవాడ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు.
కోనరావుపేట, సెప్టెంబరు 26 (ఆంధ్రజ్యోతి) : కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో పేదింటి సొంతింటి కల నెరవేరుతోందని వేములవాడ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. కోనరావుపేట మం డల కేంద్రంలో నూతన ఇందిరమ్మ ఇల్లు నిర్మించుకున్న ఎనగంటి వారి ఇంటికి వెళ్లి నూతన వస్త్రాలను శుక్రవారం కుటుంబానికి అందజేసి మాట్లాడారు. 10 సంవత్సరాలుగా సొంత ఇంటి కోసం ఎదురుచూస్తున్న పేదలకు కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేశామన్నారు. బీఆర్‌ఎస్ పాలనలో డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ఇస్తానని పేదలను మోసం చేశారనిఅన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో పేదవారి సొంతింటి కల నెరవేరిందని అన్నారు. ఈ కార్యక్రమంలో కేతిరెడ్డి జగన్మోహన్ రెడ్డి, చేపూరి గంగాధర్, మార్కెట్ కమిటీ చైర్మన్ ఎల్లయ్య, మండల అధ్యక్షుడు ఫిరోజ్‌పాషా, చందనగిరి గోపాల్, నాయని ప్రభాకర్‌రెడ్డి, రమేష్‌రెడ్డి, రుక్మిణి తదితరులు పాల్గొన్నారు.