Share News

పార్టీ శ్రేణుల అభిప్రాయాల మేరకే జిల్లా అధ్యక్షుడి ఎంపిక

ABN , Publish Date - Oct 15 , 2025 | 12:44 AM

క్షేత్రస్థాయిలో పార్టీ శ్రేణుల అభిప్రాయాల మేరకే జిల్లా అధ్యక్షుడి ఎంపిక ఉంటుందని, పార్టీ అభివృద్ధికి క్రియాశీలకంగా పనిచేసిన వారికి తగిన గుర్తింపు ఉంటుందని ఏఐఈసీ పరిశీలకుడు, ఎమ్మెల్యే శ్రీనివాస్‌ మనె అన్నారు.

పార్టీ శ్రేణుల అభిప్రాయాల మేరకే జిల్లా అధ్యక్షుడి ఎంపిక
సమావేశంలో మాట్లాడుతున్న ఎఐసీసీ పరిశీలకులు శ్రీనివాస్‌ మనె

కరీంనగర్‌ అర్బన్‌, అక్టోబరు 14 (ఆంధ్రజ్యోతి): క్షేత్రస్థాయిలో పార్టీ శ్రేణుల అభిప్రాయాల మేరకే జిల్లా అధ్యక్షుడి ఎంపిక ఉంటుందని, పార్టీ అభివృద్ధికి క్రియాశీలకంగా పనిచేసిన వారికి తగిన గుర్తింపు ఉంటుందని ఏఐఈసీ పరిశీలకుడు, ఎమ్మెల్యే శ్రీనివాస్‌ మనె అన్నారు. కాంగ్రెస్‌ జిల్లా అధ్యక్షుడి నియామక ప్రక్రియలో భాగంగా ఏఐసీసీ పరిశీలకుల బృందం మంగళవారం కరీంనగర్‌కు వచ్చింది. ఈ సందర్భంగా విలేకరులతో శ్రీనివాస్‌ మనె మాట్లాడుతూ గ్రామ, డివిజన్‌ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయిలో కాంగ్రెస్‌ పార్టీ నాయకత్వం ఎంపిక విధానంలో నూతన ఒరవడిని సృష్టించిందన్నారు. క్షేత్రస్థాయిలో బ్లాక్‌, మండల, పట్టణ కాంగ్రెస్‌ అధ్యక్షులు, అనుబంధ సంఘాలు, విభాగాల అధ్యక్షులు, ముఖ్య నేతలు, పార్టీ కార్యకర్తల నుంచి అభిప్రాయ సేకరిస్తున్నామన్నారు. ప్రజలకు అందుబాటులో ఉండేవారిని, ప్రజా పాలనలో భాగస్వాములై సమన్వయకర్తగా పని చేయగలిగే వారిని ఎన్నుకునే ఉద్దేశంతో కాంగ్రెస్‌ ఈ పద్ధతికి శ్రీకారం చుట్టిందని అన్నారు. కార్యాకర్తల అభిప్రాయ సేకరణ ముగిసిన తర్వాత ఆ నివేదికను టీపీసీసీ అధ్యక్షుడు మహేష్‌ కుమార్‌గౌడ్‌కు, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, సోనియాగాంధీ, రాహుల్‌ గాంధీ, ఇతర ముఖ్య నేతలకు అందజేయనున్నట్లు తెలిపారు. సమావేశంలో ఏఐసీసీ పరిశీలకు బృంద సభ్యులు, టీపీసీసీ ఉపాధ్యక్షులు ఆత్రం సుగుణ, చిట్ల సత్యనారాయణ, డీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్యే డాక్టర్‌ కవ్వంపల్లి సత్యనారాయణ, సుడా చైర్మన్‌ కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డి, గ్రంథాలయ చైర్మన్‌ సత్తు మల్లేశం, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి రహమత్‌ హుస్సేన్‌, కరీంనగర్‌ పార్లమెంట్‌ నియోజకవర్గ ఇన్‌చార్జి వెలిచాల రాజేందర్‌రావు, నాయకులు అల్ఫోర్స్‌ నరేందర్‌రెడ్డి, టీపీసీసీ కోఆర్డినేటర్‌ మ్యాడం బాలకృష్ణ, కోమటిరెడ్డి పద్మాకర్‌రెడ్డి, బొమ్మ శ్రీరాం చక్రవర్తి, వైద్యుల అంజన్‌కుమార్‌, ఎండీ తాజ్‌, పులి ఆంజనేయులుగౌడ్‌, కర్ర సత్యప్రసన్నరెడ్డి, ఆకారపు భాస్కర్‌రెడ్డి, మాజీ కార్పొరేటర్లు చాడగొండ బుచ్చిరెడ్డి, మల్లిఖార్జున రాజేందర్‌, ఆకుల నర్సయ్య, శ్రావణ్‌ నాయక్‌, కొరివి అరుణ్‌ కుమార్‌, మడుపుమోహన్‌, పత్తి మధు, పురం రాజేశం, పత్తి కృష్ణారెడ్డి, ముస్తాక్‌, అబ్దుల్‌ రహమాన్‌ పాల్గొన్నారు.

ఫ మహిళా నాయకురాళ్ల వాగ్వాదం...

ఏఐసీసీ పరిశీలకుడు శ్రీనివాస్‌ మానె డీసీసీ కార్యాలయంలో ఒక వైపు మీడియాతో మాట్లాడుతున్న సమయంలోనే కరీంనగర్‌ 22వ డివిజన్‌కు చెందిన కాంగ్రెస్‌ పార్టీ మహిళా నాయకురాళ్లు ఆ డివిజన్‌ మాజీ కార్పొరేటర్‌ భర్త, కాంగ్రెస్‌ నాయకుడు గంట శ్రీనివాస్‌తో వాగ్వాదానికి దిగారు. ఇటీవల కాంగ్రెస్‌ నగర అధ్యక్షురాలిగా నియమితురాలైన రజితారెడ్డి నగరంలోని డివిజన్‌ కమిటీలను నియమిస్తున్న క్రమంలో 22వ డివిజన్‌ నుంచి గడ్డం కొమురమ్మ, సాగరిక పేర్లను పరిశీలించాలని గంట శ్రీనివాస్‌ కోరారు. దీనిపై ముల్కల కవితతోపాటు షబానా మహ్మద్‌ అభ్యంతరం తెలిపారు. తాము మొదటి నుంచి పార్టీలో కష్టపడి పనిచేస్తుండగా సీనియర్లను కాదని వేరే వారి పేర్లను ఎలా పరిశీలనకు ఇస్తారంటూ అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో గంట శ్రీనివాస్‌కు కవిత, షబానాల మద్య కొద్దిసేపు వాగ్వాదం చోటు చేసుకుంది. ఇతర నాయకులు ఇద్దరికి నచ్చజెప్పి అక్కడి నుంచి పంపించివేశారు.

Updated Date - Oct 15 , 2025 | 12:44 AM