Share News

దివ్యాంగులు ఆత్మస్థైర్యంతో ముందుకు వెళ్లాలి

ABN , Publish Date - Dec 04 , 2025 | 01:12 AM

దివ్యాంగులు ఆత్మస్థైర్యంతో ముందుకు వెల్లాలని ఇన్‌చార్జి కలెక్టర్‌ గరిమ అగ్రవాల్‌ అన్నారు.

దివ్యాంగులు ఆత్మస్థైర్యంతో ముందుకు వెళ్లాలి

సిరిసిల్ల టౌన్‌, డిసెంబరు 3 (ఆంధ్రజ్యోతి) : దివ్యాంగులు ఆత్మస్థైర్యంతో ముందుకు వెల్లాలని ఇన్‌చార్జి కలెక్టర్‌ గరిమ అగ్రవాల్‌ అన్నారు. జిల్లా మహిళ, శిశు, దివ్యాంగులు, వయోవృ ద్ధుల శాఖ, మెప్మా సంయుక్త ఆధ్వర్యంలో బుధవారం జిల్లా కేంద్రం ప్రభుత్వ జూనియర్‌ కళాశాల క్రీడా మైదానంలో అంత ర్జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథి ఇన్‌చార్జి కలెక్టర్‌ గరిమ అగ్రవాల్‌ ముందుగా జ్యోతి ప్రజ్వలన నిర్వహించి దివ్యాంగుల ఆటపోటీలను ప్రారం భించారు. ఈ సందర్భంగా ఇన్‌చార్జి కలెక్టర్‌ మాట్లాడుతూ దివ్యాంగులు అందరితో పాటు చదువుకొని ఉన్నత స్థానాలకు ఎదగాలని ఆకాంక్షించారు. జిల్లా కేంద్రంలోని జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో సెర్ప్‌ ఆధ్వర్యంలో యుడీఐడీ కేంద్రం అందుబాటులోకి వస్తుందన్నారు. యూడీఐడీ సేవలను పూర్తి స్థాయిలో వినియోగించుకోవాలని అన్నారు. త్వరంలో డేకేర్‌ సెంటర్‌ సేవలు సైతం త్వరలో అందుబాటులోకి వచ్చేలా చర్యలు తీసుకోవాలని జిల్లా సంక్షేమ అధికారి లక్ష్మీరాజంను ఆదేశించారు. రెగ్యు లర్‌గా శిబిరాలను నిర్వహిస్తూ అలింకో ద్వారా సహాయ ఉపకరణాలు అందిస్తామని దివ్యాంగులకు హామీ ఇచ్చారు. సిరిసిల్ల పట్టణానికి చెం దిన శ్రీలక్ష్మి వికలాంగుల సంఘానికి ఎస్‌బీఐ ఆధ్వర్యంలో రూ. 8లక్షల బ్యాంక్‌ లింకేజ్‌ రుణానికి సంబంధించిన పత్రాలు సంఘం బాధ్యులకు ఇన్‌చార్జి కలెక్టర్‌ అందజేశారు. అనంతరం బ్యాంక్‌ అధికారులను ఇన్‌ చార్జి కలెక్టర్‌ సన్మానించారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి లక్ష్మిరాజం, మున్సిపల్‌ కమిషనర్‌ ఖాదీర్‌పాషా, మెప్మా ఏవో మీర్జా ఫసహత్‌ ఆలీబేగ్‌ దివ్యాంగులు వృద్ధులు, సంక్షేమ సంఘం సభ్యులు, దివ్యాంగులు పాల్గొన్నారు.

సిరిసిల్ల పౌర సంక్షేమ సమితి ఆధ్వర్యంలో...

సిరిసిల్ల పౌర సంక్షేమ సమితి ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని శ్రీ సత్యసాయి సేవా మందిరం ఆవరణలో అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ముందుగా కేక్‌ కట్‌ చేసి స్వీట్ల ను పంపిణీ చేశారు. అనంతరం అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్స వాన్ని పురస్కరించుకొని నిర్వహించిన క్రీడలలో విజేతలైన దివ్యాంగుల కు బహుమతుల ప్రదానం చేశారు. అదే విధంగా స్థానిక వ్యాపారి పుల్లూరి కృష్ణమూర్తి 60 మంది దివ్యాంగులకు ఉచితంగా దుప్పట్లు, పౌర సంక్షేమ సమితి మహిళలకు చీరలను పంపిణీ చేసి ఘనంగా సన్మానించారు. అనంతరం 100 మంది దివ్యాంగులకు ఉచిత బోజన అందించారు. ఈ కార్యక్రమంలో సిరిసిల్ల పౌర సంక్షేమ సమితి అధ్య క్షుడు బియ్యంకార్‌ శ్రీనివాస్‌, ఉపాధ్యక్షుడు చీకోటి అనిల్‌కుమార్‌, ప్రధా న కార్యదర్శి వేముల సత్యనారాయణ, సహాయ కార్యదర్శి కుసుమ గణేష్‌, కోశాధికారి చిప్ప దేవదాస్‌, జిల్లా దివ్యాంగుల సంక్షేమ సంఘం అధ్యక్షురాలు ఆకుల సంధ్య, ఉపాధ్యక్షులు జవ్వాజి అమర్నాథ్‌, సుజాత, సుల్తానా, దివ్యాంగులు, వయోవృద్ధులు పాల్గొన్నారు.

Updated Date - Dec 04 , 2025 | 01:12 AM