Share News

గ్రామాల అభివృద్ధే ప్రభుత్వ ప్రధాన ధ్యేయం

ABN , Publish Date - Sep 26 , 2025 | 12:40 AM

గ్రా మాల అభివృద్ధే ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్‌ సంజయ్‌కుమార్‌ అన్నారు. జగిత్యాల రూరల్‌ మండలం వెల్దుర్తి గ్రామంలో రూ. 20 లక్షలతో నిర్మించిన గ్రామపంచాయతీ భవనాన్ని ఎమ్మెల్యే సంజయ్‌ కుమార్‌ గురువారం ప్రారంభించారు.

గ్రామాల అభివృద్ధే ప్రభుత్వ ప్రధాన ధ్యేయం
గ్రామపంచాయతీ భవనాన్ని ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే సంజయ్‌కుమార్‌

జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్‌ సంజయ్‌కుమార్‌

జగిత్యాలరూరల్‌, సెప్టెంబరు 25 (ఆంఽధ్రజ్యోతి): గ్రా మాల అభివృద్ధే ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్‌ సంజయ్‌కుమార్‌ అన్నారు. జగిత్యాల రూరల్‌ మండలం వెల్దుర్తి గ్రామంలో రూ. 20 లక్షలతో నిర్మించిన గ్రామపంచాయతీ భవనాన్ని ఎమ్మెల్యే సంజయ్‌ కుమార్‌ గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్రంలో గ్రామాల అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టిసారించిందన్నారు. వెల్దుర్తి గ్రామంలో ఇటీవలే పశువైద్యశాలకు భూమిపూజ చేయ డంతో పాటుగా నూతన గ్రామపంచాయితీ భవనం ప్రారంభించినట్లు ఎమ్మెల్యే పేర్కొన్నారు.

రైతులకు అండగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తోంద ని యూరియా కొరత విషయంలో అనేక కారణాలు ఉన్నాయని, దీనిని రాజకీయం చేయడం తగదన్నా రు. కార్యక్రమంలో ఈఈ లక్ష్మణ్‌, ఎంపీడీవో రమాదేవి, ఏఎంసీ మాజీ చైర్మన్‌ దామోదర్‌రావు, నక్కల రవీందర్‌రెడ్డి, సీనియర్‌ నాయకులు బాల ముకుందం, రౌతుగంగాధర్‌, మాజీ సర్పంచ్‌ ప్రవీణ్‌, మాజీ ఎంపీటీసీ మమతశంకర్‌, గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Sep 26 , 2025 | 12:40 AM