గోవధ నిషేధ చట్టాన్ని పకడ్బందీగా అమలుచేయాలి
ABN , Publish Date - Oct 25 , 2025 | 12:47 AM
రాష్ట్రంలో గోవధ నిషేధ చట్టాన్ని పకడ్బందీగా అమలుచేయాలని బీజేపీ రాష్ట్ర సీనియర్ నాయకుడు, జిల్లా మాజీ అధ్యక్షుడు మోరపల్లి సత్యనారాయణరావు అన్నారు. గోరక్షకుడు సోనూసింగ్ అలియాస్ ప్రశాంత్‌పై తుపాకీతో కాల్చిన వారిని కఠినంగా శిక్షించాలని కోరుతూ సీఎం రేవంత్‌రెడ్డికి లేఖ రాస్తూ కలెక్ట ర్ కార్యాలయంలో అదనపు కలెక్టర్ రాజగౌడ్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు.
- బీజేపీ రాష్ట్ర సీనియర్ నాయకుడు సత్యనారాయణరావు
జగిత్యాల అగ్రికల్చర్, అక్టోబరు 24 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో గోవధ నిషేధ చట్టాన్ని పకడ్బందీగా అమలుచేయాలని బీజేపీ రాష్ట్ర సీనియర్ నాయకుడు, జిల్లా మాజీ అధ్యక్షుడు మోరపల్లి సత్యనారాయణరావు అన్నారు. గోరక్షకుడు సోనూసింగ్ అలియాస్ ప్రశాంత్‌పై తుపాకీతో కాల్చిన వారిని కఠినంగా శిక్షించాలని కోరుతూ సీఎం రేవంత్‌రెడ్డికి లేఖ రాస్తూ కలెక్ట ర్ కార్యాలయంలో అదనపు కలెక్టర్ రాజగౌడ్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భం గా సత్యనారాయణరావు మాట్లాడుతూ హైదరా బాద్‌లోని ఘట్‌కేస్కర్ వద్ద గోవులను అక్రమం గా తరలిస్తున్నారనే సమాచా రంతో లారీలను ఆపి, గోవులను రక్షించే ప్రయత్నం చేసిన సోనూపై ఇబ్రహీం అనే వ్యక్తి తుపాకీతో కాల్చ డం దుర్మార్గం అన్నారు. ఇంతటి దారుణానికి ఒడిగట్టిన సదరు నిందితుడిని పట్టుకోవడంలో పోలీసుశాఖ వైఫల్యం కొట్టొచ్చినట్లు కనబడుతోందని సత్యనారాయణరావు విమర్శిం చారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా వివిధ హోదాల బాధ్యులు యాదగిరిబాబు, నలువాల తిరుపతి, వడ్డేపల్లి శ్రీనివాస్, పిల్లి శ్రీనివాస్, జుంబర్తి దివాకర్, ఆముద రాజు, కాయితి శంకర్, నరేందర్‌రెడ్డి, ఓరుగంటి చంద్రశేఖర్, సాంబారి కళావతి, జుంబర్తి దివాకర్, తుకారం గౌడ్, ఇట్నేని రమేష్, మర్రిపెల్లి సత్యం, రాజేందర్ పాల్గొన్నారు.
- నాయకుల నిరసన..
- విశ్వహిందూ పరిషత్, భజరంగ్‌దళ్ గోరక్షక విభాగం రాష్ట్రశాఖ పిలుపు మేరకు జగిత్యాల జిల్లా కేం ద్రంలోని స్థానిక తహసీల్ చౌర స్తా వద్ద భజరంగ్‌దళ్ ఆధ్వర్యంలో నాయకులు నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా గోరక్ష ప్రముఖ్ ఆడెపు నరేష్ మాట్లాడుతూ గోరక్షకు డు సోనూపై జరిగిన కాల్పుల ఘటన విచారక రమని, ఇది ఆటవిక పాలనకు నిదర్శనంగా భావిస్తున్నామన్నారు. వీహెచ్‌పీ, భజరంగ్‌దళ్ నాయకులు రాజన్న, రాములు, సంతోష్, అరుణ్, మహేందర్, బీజేపీ నాయకులు ఏసీఎస్ రాజు, అరవ లక్ష్మి, లింగంపేట శ్రీనివాస్, సీపెల్లి రవీందర్, ఠాకూర్ కిషోర్‌సింగ్, చీటి చంద్రశేఖర్‌రావు, మెరుగు ఉమేష్, అనిల్ ఉన్నారు.