Share News

అంగన్‌వాడీ కేంద్రాల భవన నిర్మాణాలు పూర్తిచేయాలి

ABN , Publish Date - Nov 07 , 2025 | 12:19 AM

పంచాయతీరాజ్‌ ఆధ్వర్యంలో చేపట్టిన పనులను త్వరగా పూర్తి చేయాలని జిల్లా ఇన్‌చార్జి కలెక్టర్‌ గరిమా అగర్వాల్‌ ఆదేశించారు.

అంగన్‌వాడీ కేంద్రాల భవన నిర్మాణాలు పూర్తిచేయాలి

సిరిసిల్ల, నవంబరు 6 (ఆంధ్రజ్యోతి): పంచాయతీరాజ్‌ ఆధ్వర్యంలో చేపట్టిన పనులను త్వరగా పూర్తి చేయాలని జిల్లా ఇన్‌చార్జి కలెక్టర్‌ గరిమా అగర్వాల్‌ ఆదేశించారు. గురువారం కలెక్టరేట్‌లో పంచాయతీరాజ్‌ శాఖ పరిధిలో విద్యా శాఖ, పంచాయతీ, అంగన్‌వాడీ, ఆరోగ్య శాఖ భవ నాలు, ఎంపీ ల్యాడ్స్‌ నిధుల కింద జిల్లాలో మొదలు పెట్టి న పనులపై వివిధ శాఖల, పంచాయతీరాజ్‌ శాఖ అధికా రులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడారు. జిల్లాలో 49 అంగన్‌వాడీ కేంద్రాలకు భవనా లు మంజూరు కాగా, పలు భవనాలు పూర్తి కాగా, మిగ తావి వివిధ దశల్లో ఉన్నాయని కలెక్టర్‌ దృష్టికి తీసుకె ళ్లారు. ఆయా పనులను పూర్తి చేసి, పిల్లలను ఆకట్టుకునే రంగులు వేయాలని, నీటి వసతి మిషన్‌ భగీరథ ద్వారా కల్పించాలని ఆదేశించారు. గ్రామ పంచాయతీ భవనాల పనులను వేగంగా పూర్తిచేసి వినియోగంలోకి తీసుకురావాలని సూచిం చారు. భవిత కేంద్రాల భవనాలపై ప్రత్యేక శ్రద్ధపెట్టాలని, గడువు పెట్టి పనులను పూర్తి చేయాలని ఆదేశించారు. జిల్లాలోని 13 కేజీబీవీల్లో మంజూరు అయిన అదనపు తరగతి గదులు, ఇతర మరమ్మత్తు పను లను వెంటనే చేపట్టాలని, విద్యార్థులకు ఇబ్బందులు కలగకుండా చే యాలని సూచించారు. ఎంపీ ల్యాడ్స్‌ కింద జిల్లాకు మంజూరు అయిన పనులను వెంటనే మొదలు పెట్టి 15 రోజుల్లో పూర్తిచేయాలని తెలి పారు. పీహెచ్‌సీలు, సబ్‌ సెంటర్ల పనులను పూర్తి చేసి, వైద్య ఆరోగ్య శాఖకు అప్పగించాలని సూచించారు. ఇంకా మొదలు పెట్టని పనులకు వెంటనే టెండర్లు చేయాలని, గడువులోగా పూర్తిచేయించి వినియోగం లోకి తీసుకురావాలని సూచించారు. ఆయా శాఖల అధికారులు సమ న్వయంతో పని చేసి, పనులను పూర్తి చేయాలని ఆదేశించారు. సమా వేశంలో డీఆర్డీవో శేషాద్రి, డీఈవో వినోద్‌కుమార్‌, పీఆర్‌ ఈఈ సుద ర్శన్‌రెడ్డి, డీఎంహెచ్‌వో డాక్టర్‌ రజిత, జీసీడీవో పద్మజ, డీపీవో షర్పు ద్దీన్‌, సంక్షేమ అధికారి లక్ష్మీరాజం తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Nov 07 , 2025 | 12:19 AM