కార్పొరేషనపై కాంగ్రెస్ జెండా ఎగరవేయాలి
ABN , Publish Date - Dec 28 , 2025 | 12:08 AM
కరీంనగర్ మున్సిపల్ కార్పొ రేషనపై కాంగ్రెస్ జెండా ఎగరవేయాలని డీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం అన్నారు. డీసీసీ కార్యాలయంలో శనివారం కాంగ్రెస్ ముఖ్య నాయకులతో నిర్వహించిన అత్యవసర సమావేశంలో మాట్లాడారు.
కరీంనగర్ అర్బన, డిసెంబరు 27 (ఆంధ్రజ్యోతి): కరీంనగర్ మున్సిపల్ కార్పొ రేషనపై కాంగ్రెస్ జెండా ఎగరవేయాలని డీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం అన్నారు. డీసీసీ కార్యాలయంలో శనివారం కాంగ్రెస్ ముఖ్య నాయకులతో నిర్వహించిన అత్యవసర సమావేశంలో మాట్లాడారు. పార్టీని గెలిపించేందుకు ప్రతీ కార్యకర్త సైనికుడిలా పని చేయాల న్నారు. ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. అంతకుముందు కాంగ్రెస్ నగర కమిటీ, జిల్లా కమిటీల ఏర్పా టుకు సంబంధించి సమీక్షించారు. పట్టణం లోని 66 డివిజన్లను 6 జోన్లుగా విభజించారు. ప్రతీ జోన పరిధిలోకి 11 డివిజన్లు ఏర్పాటు చేయాలని, ముగ్గురు సభ్యుల చొప్పున నియమించాలని సూచించారు. ఇందులో ఒకరు జనరల్ సెక్రెటరీగా, ఇద్దరు సెక్రెట రీలుగా బాధ్యతలు నిర్వహించాలని నిర్ణయించారు. టీపీసీసీ ప్రతి నిధులు నమ్మిండ్ల శ్రీనివాస్, రుద్ర సంతోష్, గౌస్, సుడా చైర్మన కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఆరేపల్లి మోహన, వొడి తల ప్రణవ్, నగర కాంగ్రెస్ కార్పొ రేషన అధ్యక్షుడు అంజనకుమార్, రాహుల్, కోమటిరెడ్డి పద్మాకర్‌రెడ్డి, తాజ్, మోహన, అరుణ్ కుమార్, శ్రావణ్‌నాయక్ పాల్గొన్నారు.