Share News

కార్పొరేషన్‌పై కాంగ్రెస్‌ జెండా ఎగురుతుంది..

ABN , Publish Date - Sep 13 , 2025 | 11:46 PM

వచ్చే ఎన్నికల్లో కరీంనగర్‌ కార్పొరేషన్‌పై కాంగ్రెస్‌ జెండా ఎగురవేస్తామని సుడా చైర్మన్‌, నగర కాంగ్రెస్‌ అధ్యక్షుడు కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. జిల్లా కాంగ్రెస్‌ కార్యాలయంలో శనివారం నిర్వహించిన సిటీ కాంగ్రెస్‌ విస్తృత స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రతి ఇంటికి ప్రభుత్వ సంక్షేమ పథకాలను తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు.

కార్పొరేషన్‌పై కాంగ్రెస్‌ జెండా ఎగురుతుంది..

కరీంనగర్‌ అర్బన్‌, సెప్టెంబరు 13 (ఆంధ్రజ్యోతి): వచ్చే ఎన్నికల్లో కరీంనగర్‌ కార్పొరేషన్‌పై కాంగ్రెస్‌ జెండా ఎగురవేస్తామని సుడా చైర్మన్‌, నగర కాంగ్రెస్‌ అధ్యక్షుడు కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. జిల్లా కాంగ్రెస్‌ కార్యాలయంలో శనివారం నిర్వహించిన సిటీ కాంగ్రెస్‌ విస్తృత స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రతి ఇంటికి ప్రభుత్వ సంక్షేమ పథకాలను తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. స్థానిక నాయకులు డివిజన్లలో చురుకుగా పని చేయాలని, అర్హులైన వారికి సంక్షేమ పథకాలు అందుతున్నాయా లేదా చూడాలని సూచించారు. నగరంలో భూమి ఉన్న ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చే అవకాశం ఉందని, డబుల్‌ బెడ్రూం ఇళ్లు అర్హులకు దక్కేలా చూడాలని, బతుకమ్మ చీరలు పంపిణీలో భాగస్వాములు కావాలన్నారు. పార్టీ కోసం కష్టకాలంలో పనిచేసిన ప్రతి ఒక్కరిని గుర్తిస్తామన్నారు. అల్ఫోర్స్‌ నరేందర్‌రెడ్డి మాట్లాడుతూ ఎవరైనా పార్టీ సిద్ధాంతాల ప్రకారం నడుచుకోవలసిందేనన్నారు. సమావేశంలో మాజీ ఎమ్మెల్యే ఆరెపల్లి మోహన్‌, ఎండీ తాజ్‌, కొరివి అరుణ్‌కుమార్‌, శ్రవణ్‌నాయక్‌, సమద్‌ నవాబ్‌, లాయక్‌, జీడి రమేష్‌, చర్ల పద్మ, ఖమ్రెద్దీన్‌, ఎలగందుల మల్లేశం, కుర్ర పోచయ్య, అబ్దుల్‌ రహమాన్‌ పాల్గొన్నారు.

Updated Date - Sep 13 , 2025 | 11:46 PM