Share News

కోడిగుడ్ల సరఫరాను కమిటీ పర్యవేక్షించాలి

ABN , Publish Date - Jul 25 , 2025 | 12:38 AM

ప్రభుత్వ ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనా ర్టీ సంక్షేమహాస్టల్స్‌, అంగన్‌వాడీ కేంద్రాల్లో కోడిగుడ్ల సరఫరాను కమిటీ ఏర్పాటు చేసి పర్యవేక్షించాలని కలెక్టర్‌ సందీప్‌కుమార్‌ ఝా ఆదేశించారు.

కోడిగుడ్ల సరఫరాను కమిటీ పర్యవేక్షించాలి

సిరిసిల్ల కలెక్టరేట్‌, జూలై 24 (ఆంధ్రజ్యోతి) : ప్రభుత్వ ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనా ర్టీ సంక్షేమహాస్టల్స్‌, అంగన్‌వాడీ కేంద్రాల్లో కోడిగుడ్ల సరఫరాను కమిటీ ఏర్పాటు చేసి పర్యవేక్షించాలని కలెక్టర్‌ సందీప్‌కుమార్‌ ఝా ఆదేశించారు. కలెక్టరేట్‌లో గురువారం కోడిగుడ్ల సరఫరా టెండర్లపై ఆయా శాఖల అధికారులతో కలెక్టర్‌ సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కోడిగుడ్ల సరఫరా టెండ ర్ల కమిటీ చైర్మన్‌గా కలెక్టర్‌ సందీప్‌కుమార్‌ఝా, ఆయా రెసిడెన్షియల్‌ విద్యాల యాల బాధ్యులు, పశుసంవర్ధక శాఖ అధికారులు సభ్యులుగా ఉంటారని ప్రక టించారు. ప్రభుత్వ వసతిగృహాల నుంచి కోడిగుడ్ల ఇండెంట్‌ వివరాలు కలెక్టర్‌కు అందించాలన్నారు. జిల్లా అడ్మినిస్ట్రేషన్‌ నుంచి నేరుగా సప్లయర్‌కు అవసరమైన కోడిగుడ్లు ఇండెంట్‌ను సమర్పిస్తామన్నారు. గత సంవత్సరం అడ్మిషన్‌లకు అద నంగా పదిశాతం విద్యార్థుల సంఖ్య పెరిగిందని, దానికి ప్రకారం ఇండెంట్‌లను తయారు చేయాలని కలెక్టర్‌ అదేశించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు కోడిగుడ్ల బరువు 45 గ్రాముల నుంచి 52 గ్రాములు ఉండాలన్నారు. ప్రతి నెలలో రెండు సార్లు సరఫరా చేయాలని, అర్హత అనుభవం ఉన్న వారికి నిబంధనల ప్రకారం కోడిగుడ్లు సరఫరా చేసే హక్కులు అందజేయాలన్నారు. కోడి గుడ్లు సరఫరాలో ఆలస్యం చేస్తే జరిమానా విధిస్తామన్నారు. టెండర్ల విధానం, టెండర్ల ఆహ్వానం, తెరవడంపై చర్చించారు. ఈ సమావేశంలో జిల్లా విద్యాధికారి వినోద్‌కుమార్‌, జిల్లా సంక్షేమాధికారి లక్ష్మీరాజం, జిల్లా పశుసంవర్థక శాఖ అధికారి రవీందర్‌రెడ్డి, జిల్లా బీసీ సంక్షేమ శాఖ అధికారి రాజమనోహార్‌రావు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jul 25 , 2025 | 12:38 AM