Share News

కాం్యపు కార్యాలయంలో జెండా ఎగురవేసిన కలెక్టర్‌

ABN , Publish Date - Aug 16 , 2025 | 12:08 AM

District Additional Collector Lakshmi Kiran unfurls the national flag at the Collectorate

 కాం్యపు కార్యాలయంలో జెండా ఎగురవేసిన కలెక్టర్‌
కలెక్టర్‌ క్యాంపు కార్యాలయంలో జెండాను అవిష్కరిస్తున్న జిల్లా కలెక్టర్‌ పమేలా సత్పతి

కరీంనగర్‌, ఆగస్టు 15(ఆంధ్రజ్యోతి, ప్రతినిధి): స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా క్యాంపు కార్యాలయంలో జిల్లా కలెక్టర్‌ పమేలా సత్పతి జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం జిల్లా పరిషత్‌ కార్యాలయంలో ప్రత్యేక అధికారి హోదాలో జిల్లా కలెక్టర్‌ పమేలా సత్పతి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం కరీంనగర్‌ క్లబ్‌లో జిల్లా కలెక్టర్‌ పమేలా సత్పతి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. జిల్లా కలెక్టరేట్‌లో జిల్లా అదనపు కలెక్టర్‌ లక్ష్మీకిరణ్‌ జాతీయ పతాకాన్ని అవిష్కరించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్‌ కలెక్టర్‌ అశ్విని తానాజీ వాకడే, జిల్లా రెవెన్యూ అధికారి వెంకటేశ్వర్లు, ఆర్డీవో మహేశ్వర్‌, ఏవో సుధాకర్‌, జడ్పీ సీఈఓ శ్రీనివాస్‌, గెజిటెడ్‌ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు ఖాళిచరణ్‌, నాన్‌ గెజిటెడ్‌ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు దారం శ్రీనివాస్‌రెడ్డి, వివిధ ఉద్యోగ సంఘాల నాయకులు, కలెక్టరేట్‌ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Aug 16 , 2025 | 12:08 AM