Share News

బోనమెత్తిన కరీంనగరం

ABN , Publish Date - Jul 14 , 2025 | 12:41 AM

ఆషాఢమాసం సందర్భంగా ఆదివారం కరీంనగర్‌లో ఎక్కడ చూసినా ఆధ్యాత్మిక వాతావరణం కనిపించింది. ప్రజలు గ్రామ, కుల దేవతల బోనాల జాతరలను వైభవంగా నిర్వహించారు. 51వ డివిజన్‌లో మాజీ కార్పొరేటర్‌ బండారి వేణు ఆధ్వర్యంలో పోచమ్మ బోనాల జాతర జరిగింది.

బోనమెత్తిన కరీంనగరం

కరీంనగర్‌ కల్చరల్‌, జూలై 13 (ఆంధ్రజ్యోతి): ఆషాఢమాసం సందర్భంగా ఆదివారం కరీంనగర్‌లో ఎక్కడ చూసినా ఆధ్యాత్మిక వాతావరణం కనిపించింది. ప్రజలు గ్రామ, కుల దేవతల బోనాల జాతరలను వైభవంగా నిర్వహించారు. 51వ డివిజన్‌లో మాజీ కార్పొరేటర్‌ బండారి వేణు ఆధ్వర్యంలో పోచమ్మ బోనాల జాతర జరిగింది. మంకమ్మతోట, రాంనగర్‌ మున్నూరుకాపు సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన బోనాల్లో సంఘ రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ చల్ల హరిశంకర్‌, మాజీ డిప్యూటీ మేయర్‌ చల్ల స్వరూపారాణి, ఎంఆర్‌ ముకాస గౌరవాధ్యక్షుడు మల్లికార్జున రాజేందర్‌ పాల్గొన్నారు. ఏడో డివిజన్‌, హౌసింగ్‌బోర్డ్‌ కాలనీలో నారదాసు వసంతరావు-స్రవంతి దంపతుల ఆధ్వర్యంలో బంగారు మైమ్మతల్లి వార్షికోత్సవం సందర్భంగా బోనాలు, సారె, నిలువెత్తు బంగారం సమర్పించి పూజలు చేశారు. శ్రీపురం కాలనిలో మైసమ్మ బోనాలను జరుపగా కాలని కమిటీ బాధ్యులు, కాలని వాసులు పాల్గొన్నారు. భగత్‌నగర్‌ మున్నూరుకాపు సంఘం ఆధ్వర్యంలో జరిగిన పోచమ్మ బోనాల జాతరలో బీజేపి నాయకుడు, మాజీ మేయర్‌ వై సునీల్‌రావు పాల్గొని బోనమెత్తుకున్నారు. పోచమ్మవాడలోని పార్వతీనగర్‌ భక్తులు పోచమ్మ బోనాలను నిర్వహించారు. 26వ డివిజన్‌, సుభాష్‌నగర్‌ పట్టణ ముదిరాజ్‌ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన పోచమ్మ బోనాల జాతరలో మాజీ కార్పొరేటర్లు వైద్యుల శ్రీదేవి-అంజన్‌కుమార్‌, చిగిరి రవీందర్‌, ఏ వేణు, కె అనిల్‌, పట్ణ ముదిరాజ్‌సంఘం కార్యవర్గ కమిటీ అధ్యక్ష ఉపాధ్యక్షులు బాసవేని పరశురాములు, బోయిన సంతోష్‌కుమార్‌, ప్రధానకార్యదర్శి ఎన్‌ శ్రీనివాస్‌, శ్యామ్‌, సభ్యులు పాల్గొన్నారు. హౌసింగ్‌బోర్డ్‌ కాలనీ మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో పోచమ్మ బోనాలు నిర్వహించారు.

Updated Date - Jul 14 , 2025 | 12:42 AM