కార్మిక చట్టాలను కాలరాస్తున్న కేంద్ర ప్రభుత్వం
ABN , Publish Date - Oct 20 , 2025 | 12:26 AM
కార్మిక చట్టాలను కేంద్ర ప్రభుత్వం కాలరాస్తోందని సీఐటీ యూ రాష్ట్ర కార్యదర్శి ఎరవెల్లి ముత్యంరావు విమర్శిం చారు.
తంగళ్లపల్లి, అక్టోబరు 19 (ఆంధ్రజ్యోతి): కార్మిక చట్టాలను కేంద్ర ప్రభుత్వం కాలరాస్తోందని సీఐటీ యూ రాష్ట్ర కార్యదర్శి ఎరవెల్లి ముత్యంరావు విమర్శిం చారు. ఆదివారం తంగళ్లపల్లి మండల కేంద్రంలో తెలం గాణ గ్రామపంచాయతీ ఎంప్లాయిస్ అండ్ వర్కర్స్ యూనియన్(సీఐటీయూ) రాజన్న సిరిసిల్ల జిల్లా 4వ మహాసభలు జిల్లా అఽధ్యక్షుడు మల్యాల నర్సయ్య అధ్య క్షతన జరిగాయి. ముందుగా తంగళ్లపల్లి మండలం బస్వాపూర్ గ్రామానికి చెందిన పంచాయతీ కార్మికుడు దాచారం భూమయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. మహాసభలకు ముఖ్యఅతిథిగా హాజ రైన ఎరవెల్లి ముత్యంరావు మాట్లడుతూ గ్రామ పంచా యతీ ఉద్యోగ, కార్మికులు నిత్యం గ్రామాల్లో పారిశుధ్యం, మంచినీటి సరఫరా, డంపింగ్ యార్డ్స్, హరితహారం, వైకుంఠధామా లు, ప్రకృతివనాల నిర్వహణతో పాటు పల్స్‌పోలియో, ఒటరు నమో దు, ఎన్నికల నిర్వహణలాంటి ప్రభుత్వ కార్యక్రమాల్లో పనులు చేస్తు న్నారన్నారు. కార్మికుల సంక్షేమాన్ని ప్రభుత్వాలు గాలికి వదిలేస్తు న్నాయని మండిపడ్డారు. అట్టడుగు వర్గాలకు సంబంధించిన పంచా యతీ సిబ్బందికి సీఐటీయూ అండగా నిలబడి అనేక ఆందోళన, పోరాటాలు, సమ్మెలు చేసినప్పటికీ ప్రభుత్వాలు ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయకుండా కార్మికులను ఇబ్బందులకు గురిచేస్తోందన్నారు. పంచాయతీ సిబ్బందికి పని భారాన్ని పెంచి వారిని బానిసలుగా మార్చే మల్టీపర్పస్ వర్కర్ విధానం రద్దు, జీవో నంబరు 51 సవర ణ, కేటగిరీలను కొనసాగించడం, వేతనాలను 2వ పీఆర్సీ పరిధిలోకి తీసుకురావడం, వేతనాల పెంపు, ఉద్యోగ భద్ర త, పర్మినెంట్, అర్హత కలిగిన వారికి పదోన్నతులు, ఇతర సమస్యల పరిష్కారానికి రాబో యే రోజుల్లో పోరాటాలు నిర్వహిస్తామన్నారు. జిల్లాలోని గ్రామపం చాయతీ ఉద్యోగ, కార్మికులందరు ఐక్యంగా పాల్గొని హక్కులను సాధించుకోవాలన్నారు. అనంతరం 33మందితో జిల్లా నూతన కమిటీ ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జిల్లా గౌరవ అధ్యక్షుడిగా కోడం రమ ణ, అధ్యక్షుడిగా బుర్ర శ్రీనివాస్, ప్రధానకార్యదర్శిగా మల్యాల నర్స య్య, ఉపాధ్యక్షులుగా అన్నల్‌దాస్ గణేశ్, వర్కోలు మల్లయ్య, అక్కల అంజయ్య, లోకిని శ్రీనివాస్, సహాయకార్యదర్శులుగా నారాపురం నర్స య్య, సందెల మహేష్, మామిడి నరేష్‌లతో పాటు మండలాల అధ్య క్షులు, కమిటీ సభ్యులుగా ఎన్నికయ్యారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు ఎగమంటి ఎల్లారెడ్డి, ఉపాధ్యక్షులు మూషం రమేష్, సహాయ కార్యదర్శి సూరం పద్మ, ఐద్వా జిల్లా కార్యదర్శి జవ్వాజి విమల, కంసాని రవి, నేరెల్ల రాజు, ఆశోక్, కిరణ్, వజ్రవ్వ, జ్యోతి, లచ్చవ్వ, కనకవ్వ, పుష్పల, మల్లవ్వ తదితరులు పాల్గొన్నారు.