Share News

కార్మిక హక్కులను కాలరాస్తున్న కేంద్ర ప్రభుత్వం

ABN , Publish Date - Dec 01 , 2025 | 12:27 AM

కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం కార్మికుల హక్కులను కాలరాస్తోందని సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు ఎస్‌వీ రమ అన్నారు.

కార్మిక హక్కులను కాలరాస్తున్న కేంద్ర ప్రభుత్వం

సిరిసిల్ల రూరల్‌, నవంబరు 30 (ఆంధ్రజ్యోతి) : కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం కార్మికుల హక్కులను కాలరాస్తోందని సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు ఎస్‌వీ రమ అన్నారు. సమరశీల పోరాటానికి కార్మికవర్గం సన్నద్ధం కావా లని కోరారు. కార్మిక హక్కుల సారధి, పోరాటాల వారధి సీఐ టీయూ రాజన్న సిరిసిల్ల జిల్లా నాలుగో మహాసభలు ఆదివా రం సిరిసిల్ల పట్టణంలోని బీవైనగర్‌ షాదీఖానాలో చేపట్టిన మహాసభల సందర్భంగా సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు ఎగ మంటి ఎల్లారెడ్డి జెండా ఆవిష్కరించారు. అనంతరం అమరవీ రుల స్థూపానికి నివాళులు అర్పించి మహాసభలను ప్రారంభిం చారు. ఈ మహాసభలకు ముఖ్యఅతిథులుగా సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు ఎస్‌వీ రమ, సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి కూరపాటి రమేష్‌, సీఐటీయూ తెలంగాణ పవర్‌లూం వర్కర్స్‌ యూనియన్‌ రాష్ట్ర అధ్యక్షుడు మూషం రమేష్‌ పాల్గొన్నారు. ఈ సంద ర్భంగా సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు ఎస్‌వీ రమ మాట్లాడుతూ కార్మిక వర్గం పోరాడి సాధించుకున్నటువంటి చట్టాలు, హక్కులను కేంద్ర బీజేపీ ప్రభుత్వం కాలరాస్తోందని మండిపడ్డారు. పోరాడి సాధిం చుకున్న కార్మిక చట్టాలను కాపాడుకోవడానికి కార్మిక వర్గం సమరశీల పోరాటాలకు సన్నద్ధం కావాలని పిలుపునిచ్చారు, రాష్ట్ర కార్యదర్శి కూర పాటి రమేష్‌ మాట్లాడుతూ పెట్టుబడిదారుల ప్రయోజనాల కోసం కార్మిక వర్గాన్ని బానిసత్వంలోకి నెట్టే విధంగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చిన కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్‌ కోడ్‌లను రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ సమావేశంలో సీఐటీయూ జిల్లా కార్యదర్శి కోడం రమణ, జిల్లా ఉపాధ్యక్షులు గుర్రం అశోక్‌, జిల్లా సహా య కార్యదర్శులు గురజాల శ్రీధర్‌, సూరం పద్మ, జిల్లా కోశాధికారి అన్నల్దాస్‌ గణేష్‌ జిల్లా కమిటీ సభ్యులు మాల్లారం అరుణ్‌కుమార్‌, మాల్లారం ప్రశాంత్‌, కార్మికులు పాల్గొన్నారు.

Updated Date - Dec 01 , 2025 | 12:27 AM