Share News

రాష్ట్రంపై కేంద్ర ప్రభుత్వం శీత కన్ను..

ABN , Publish Date - Sep 14 , 2025 | 12:58 AM

దేశంలోని బీజేపీ పాలిత ప్రాంతాల్లో యూరియా కొరతలేదని, తెలంగాణ రాష్ట్రంపైనే కేంద్ర ప్రభుత్వం శీతకన్నేసిందని కాంగ్రెస్‌ సిరిసిల్ల నియోజకవర్గం ఇంచార్జి కేకే మహేందర్‌రెడ్డి ఆరోపించారు.

రాష్ట్రంపై కేంద్ర ప్రభుత్వం శీత కన్ను..

సిరిసిల్ల టౌన్‌, సెప్టెంబరు 13 (ఆంధ్రజ్యోతి) : దేశంలోని బీజేపీ పాలిత ప్రాంతాల్లో యూరియా కొరతలేదని, తెలంగాణ రాష్ట్రంపైనే కేంద్ర ప్రభుత్వం శీతకన్నేసిందని కాంగ్రెస్‌ సిరిసిల్ల నియోజకవర్గం ఇంచార్జి కేకే మహేందర్‌రెడ్డి ఆరోపించారు. శని వారం జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో విలేక రుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కేసీఆర్‌ కూతురు, కేటీఆర్‌ సోదరి కవితనే తమ కుటుంబం అవినీతికి ఆలవాలం గా మారిందని చెప్పిందన్నారు. అందినకాడల్లా హరీష్‌రావు, సం తోష్‌రావు దోచుకున్నారని నేరెళ్ల ఘటనకు కూడా సంతోష్‌రావు బాధ్యుడని కవిత చెప్పిందన్నారు. మొదటి నుంచి కాంగ్రెస్‌ పార్టీ, ఎన్‌జీవోలు, రాజకీయ విశ్లేషకులు చెప్పింది నేజమేనని కవిత మాటల ద్వారా తేటతెల్లనైందన్నారు. రెండవసారి అమెరి కా వెళ్లివచ్చిన కవిత తన తుపాకు లను బావ హరీష్‌వైపు గురిపెట్టి నాన్నను, అన్నను వెనకేసు కొస్తూ డైవర్షన్‌ పొలిటికల్‌కు తెరలేపిందని ఆరోపించారు. నాన్న, అన్న ఎక్కడ జైళ్లకు వెళ్తారోనని కవిత కట్టుకథలు చెపుతూ బయటకు వచ్చిందన్నారు. కేటీఆర్‌, హారీష్‌ రావులు యూరియాపై తెలిసి తెలవన ట్లుగా మాట్లాడుతున్నారన్నారు. యూరియా రాష్ట్ర ప్రభుత్వం పరిధిలోనిది కాదని, కేంద్ర ప్రభుత్వం పరిధిలోనిదని పది సంవత్సరాలు రాష్ట్రాన్ని పాలించిన వారికి తెలి యదా అని ప్రశ్నించారు. దేశంలోని బీజేపీ పాలిత ప్రాంతాలలో యూ రియా కొరత లేదని తెలంగాణ రాష్ట్రంపైనే కేంద్ర ప్రభుత్వం శీతకన్నే సిందని ఆరోపించారు. తెలంగాణలో అఽధికారంలో ఉన్న ప్రజా ప్రభు త్వం దేశానికే ఒక దిక్సూచిగా మారిందని ఒక ట్రెండ్‌ సెట్టర్‌ చేస్తుంద ని బీఆర్‌ఎస్‌, బీజేపీ తట్టుకోలేకపోతుందని ఆరోపించారు. తెలంగాణలో రేవంత్‌రెడ్డి బీసీ కులగణన చేసి మీ కోటా ఇంతా మీ వాటా ఇంతా అని చేసి దేశానికే ఆదర్శప్రాయంగా నిలపడంతో బీజేపీకి వణుకు ప్రారంభమైందని అన్నారు. బీసీలం అని చెపుకునే బండి సంజయ్‌, అరవింద్‌, ఈటల, లక్ష్మణ్‌ బీసీలకు అనుగుణంగా తీసుకొచ్చిన బీసీ రిజర్వేషన్‌ 42 శాతం చట్టరూపంగా తీసుకురా వల్సి ఉండగా తొండీలు పెడుతున్నారని ఆరోపించారు. ముస్లింలు దేశ వ్యాప్తంగా కొంత భాగం బీసీలోనే ఉన్నారని అన్నారు. యూరియాను అవసరాలకు తగ్గట్టుగా యూరియాను సరఫరా చేయలేకపోతున్నామని బీజేపీ ఎంపీ రఘ నందన్‌రావు చెప్పారన్నారు. అధికారంలో కోల్పోయిన వారు రైతులను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్‌ ఎంపీలు యూరియా కోసం కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడం, ముఖ్య మంత్రి కేంద్ర మంత్రులను కలిశారన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాకు దాదాపు 21వేల మెట్రిక్‌ టన్నుల యూరియా అవసరం ఉంటే దాదాపు 15వేల మెట్రిక్‌ టన్నుల యూరియా మాత్రమే వచ్చిందన్నారు. 2009 నుంచి మొన్నటి వరకు కూడా సిరిసిల్లలో కూడా యూరియా కొరత ఉందని తాను నిరూపిస్తానన్నారు. యూరియాపై బీఆర్‌ఎస్‌ నాయకు లను పంపించి గొడవలు సృష్టిస్తున్నారని ఆరోపించారు. కేంద్రం ప్రభు త్వం తెలంగాణకు సప్లయ్‌ చేయాల్సిన వాటా రాలేదని, వచ్చినా దాని లో ప్రజలకు అందుబాటులోకి తీసుకురా వడానికి ఎప్పటికప్పుడు కృషి చేస్తున్నామన్నారు. ఈ సమావేశంలో కాంగ్రెస్‌ పట్టణ అధ్యక్షుడు చొప్ప దండి ప్రకాష్‌, ఉపాధ్యక్షుడు బొప్ప దేవయ్య, బ్లాక్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు సూర దేవ రాజు, ఎస్సీ సెల్‌ జిల్లా అధ్యక్షుడు ఆకునూరి బాలరాజు, చేనేత సెల్‌ జిల్లా అధ్యక్షుడు గోనె ఎల్లప్ప, మార్కెట్‌ కమిటీ డైరెక్టర్లు కాసర్ల రాజు, దుబాల వెంకటేశం, పీసీసీ మాజీ కార్యదర్శి గడ్డం నర్స య్య, మాజీ కౌన్సిలర్లు రాగుల జగన్‌, ఆడెపు చంద్రకళ, కుడికాల రవి కుమార్‌, ఆడెపు ప్రభాకర్‌, నాయకులు వైద్య శివప్రసాద్‌, బొద్దుల శ్రీని వాస్‌, కమలాకర్‌రావు పాల్గొన్నారు.

Updated Date - Sep 14 , 2025 | 12:58 AM