బీసీలపై కేంద్ర ప్రభుత్వానికి పట్టింపులేదు
ABN , Publish Date - Oct 12 , 2025 | 12:40 AM
తెలంగాణ రాష్ట్రంలోని బీసీల పై కేంద్ర ప్రభుత్వం బీజేపి కనీసం పట్టింపులేదని సీపీఏం జిల్లా కార్యదర్శి ముషం రమేష్ అన్నారు.
వేములవాడ టౌన్, అక్టోబరు 11 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ రాష్ట్రంలోని బీసీల పై కేంద్ర ప్రభుత్వం బీజేపి కనీసం పట్టింపులేదని సీపీఏం జిల్లా కార్యదర్శి ముషం రమేష్ అన్నారు. వేములవాడ పట్టణంలోని సీపీఎం కార్యలయంలో శనివారం విలేకర్ల సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా రమేష్ మాట్లాడుతూ తెలం గాణ అసెంబ్లీలో బీసీ బిల్లు ఏకగ్రీవంగా తీర్మాణం చేసి పంపించిన కేంద్రం ఆమో దం తెలుపలేదని, రాష్ట్ర గవర్నర్ ఆమోదం పొందకుండా కేంద్ర ప్రభుత్వం అడ్డు కుందని ఆరోపించారు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న కేంద్ర మంత్రులు, ఎంపీలు వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ ఆమోదం తెలుపేలా కరీంనగర్ ఎంపీ, కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ చర్యలు తీసుకోవాలన్నారు. బీసీ బిడ్డను అని చెప్పుకునే మంత్రి బీసీ రిజర్వేషన్ గురించి ఎందుకు మాట్లాడటం లేదని విమర్శించారు. బీసీ సమాజానికి ఆయన క్షమాపణ చేప్పాలని లేనిపక్షంలో వెంటనే కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ 10 శాతం ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం బీసీలకు 42 శాతం రిజర్వేషన్ ఇవ్వడానికి ముందుకు రాకపోవడం సిగ్గు చేటన్నారు. రాష్ట్రంలోని వివిధ హోదాల్లో కొనసాగుతున్న బీజేపి మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు కేంద్రాన్ని ఒప్పించాలని లేనిపక్షంలో రాష్ట్రంలో బీజేపీ లేకుం డా బీసీలు చేస్తారని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యవర్గ సభ్యుడు ఎగమంటి ఎల్లారెడ్డి,జవ్వాజి విమల, ముక్తికాంతం అశోక్, ప్రశాంత్, సూరం పద్మ, సురేష్, రాములు, నరసింహారెడ్డి శివ తదితరులు ఉన్నారు.