కేంద్రం పెన్షనర్ల డీఏ బకాయిలు విడులచేయాలి
ABN , Publish Date - Jun 16 , 2025 | 12:30 AM
కేంద్ర ప్రభుత్వం పెన్షనర్ల డీఏ బకాయిలు విడుదల చేయాలని పోస్టల్, ఆర్‌ఎంఎస్ పెన్షనర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు చెన్నమనేని వెంకటరామారావు కోరారు. ఆదివారం ఉమ్మడి కరీంనగర్ జిల్లా పోస్టల్, ఆర్‌ఎంఎస్ పెన్షనర్ల అసోసియేషన్ సమావేశం కరీంనగర్ ప్రధాన తపాల కార్యాలయంలో జరిగింది.
భగత్‌నగర్, జూన్ 15 (ఆంధ్రజ్యోతి): కేంద్ర ప్రభుత్వం పెన్షనర్ల డీఏ బకాయిలు విడుదల చేయాలని పోస్టల్, ఆర్‌ఎంఎస్ పెన్షనర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు చెన్నమనేని వెంకటరామారావు కోరారు. ఆదివారం ఉమ్మడి కరీంనగర్ జిల్లా పోస్టల్, ఆర్‌ఎంఎస్ పెన్షనర్ల అసోసియేషన్ సమావేశం కరీంనగర్ ప్రధాన తపాల కార్యాలయంలో జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా సమయంలో కేంద్ర ప్రభుత్వం పెన్షనర్లకు నిలిపి వేసిన 36 డీఏ ఇన్‌స్టాల్‌మెంట్లను విడుదల చేయక పోవడం బాధాకరమన్నారు. వృద్ధులు, సీనియర్ సిటిజన్స్‌కు రైల్వే టికెట్ రాయితీ రద్దు చేసి ఇంత వరకు పునరుద్ధరించలేదన్నారు. దేశ ఆర్థికపరిస్థితి మెరుగ్గా ఉండి జీఎస్టీ వసూళ్లు పెరిగినా పెన్షనర్లకు న్యాయంగా రావాల్సిన డీఏలు విడుదల చేయకపోవడం శోచనీయన్నారు. అసోసియేషన్ కార్యదర్శిగా కొండపాక చంద్రమోహన్‌రావును ఎన్నుకున్నారు. సమావేశంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎండి జలాలుద్దీన్, ఎం లక్ష్మీపతి, రాష్ట్ర కార్యనిర్వహక వర్కింగ్ ప్రెసిడెంట్ ఉప్పల రామేశం, కార్యదర్శి ఎం రాజయ్య, కోశాధికారి వై చంద్రమౌళి పాల్గొన్నారు.