Share News

యూనివర్సిటీల అభివృద్ధికి కేంద్రం ప్రత్యేక బడ్జెట్‌ కేటాయించాలి

ABN , Publish Date - Jun 21 , 2025 | 12:21 AM

యూనివర్సిటీల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక బడ్జెట్‌ కేటాయిం చాలని ఎస్‌ఎఫ్‌ఐ శాతవాహన యూనివర్సిటీ అధ్యక్షుడు చిట్యాల రాజు పేర్కొన్నారు.

యూనివర్సిటీల అభివృద్ధికి కేంద్రం ప్రత్యేక బడ్జెట్‌ కేటాయించాలి
ఎస్‌యూ మెయిన్‌ గేటు ఎదుట జెండా ఆవిష్కరిస్తున్న ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు

గణేశ్‌నగర్‌,జూన్‌20(ఆంధ్రజ్యోతి): యూనివర్సిటీల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక బడ్జెట్‌ కేటాయిం చాలని ఎస్‌ఎఫ్‌ఐ శాతవాహన యూనివర్సిటీ అధ్యక్షుడు చిట్యాల రాజు పేర్కొన్నారు. భారత విద్యార్థి ఫెడరేషన్‌ ఎస్‌ఎఫ్‌ఐ శాతవాహన యూనివర్సిటీ కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం మెయిన్‌ గేట్‌ ఎటు జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రాజు మాట్లాడుతూ ఈ నెల 26 నుంచి 30 తేదీ వరకు కేరళ రాష్ట్రంలోని కోజికోడ్‌లో ఎస్‌ఎఫ్‌ఐ 18వ జాతీయ మహాసభలు జరుగుతాయిని తెలిపారు. విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు, దేశ వ్యాప్తంగా ఎస్‌ఎఫ్‌ఐ విద్యార్థి సంఘం అలుపెరగని పోరాటాలు నిర్వహిస్తూ విద్యార్థుల సమస్యల పరిష్కారమే ధ్యేయంగా ముందుకు సాగుతుందని తెలిపారు. దేశవ్యాప్తంగా విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యల పైన సమరశీల పోరాటాలకు ఈ మహాసభలు వేదికబోతున్నాయని అన్నారు. అదేవిధంగా నూతన జాతీయ విద్యా విధానాన్ని రద్దు చేయాలన్నారు. యూనివర్సిటీల సమస్యలకు పరిష్కారం కోసం ప్రభుత్వాలు ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలని రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలకు సూచించారు. యూనివర్సిటీలకు ప్రత్యేక బడ్జెట్‌ కేటాయించి వాటి అభివృద్ధికి పాటుపడాలన్నారు, అదేవిధంగా యూనివర్సిటీలో ఖాళీగా ఉన్న ప్రొఫెసర్‌ పోస్టులను భర్తీ చేయాలని. సెల్ఫ్‌ ఫైనాన్స్‌ కోర్సులను రెగ్యులరైజ్‌ చేయాలని ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. కేరళలో జరిగే మహాసభలను విద్యార్థులు విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో యూనివర్సిటీ నాయకులు మాలోతు శివ, దిక్షిత్‌, వినోద్‌, ప్రవీణ్‌, మహేందర్‌, మల్లేష్‌,నరేష్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jun 21 , 2025 | 12:21 AM