Share News

బీఆర్‌ఎస్‌ పార్టీయే ప్రజలకు బాకీ ఉంది

ABN , Publish Date - Oct 12 , 2025 | 12:44 AM

రాష్ట్రంలో గత పదిసంవత్సరాలు అధికారంలో ఉన్న బీఆర్‌ఎస్‌ పార్టీ తెలంగాణ ప్రజలకు బాకీ ఉందని, దీనిని మరచిపోయి ఆ పార్టీ నాయకులు మాట్లాడడం సరైంది కాదని కాంగ్రెస్‌ పార్టీ సిరిసిల్ల నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ కేకే మహేందర్‌రెడ్డి మండిప డ్డారు.

బీఆర్‌ఎస్‌ పార్టీయే ప్రజలకు బాకీ ఉంది

సిరిసిల్ల రూరల్‌, అక్టోబరు 11 (ఆంధ్రజ్యోతి) : రాష్ట్రంలో గత పదిసంవత్సరాలు అధికారంలో ఉన్న బీఆర్‌ఎస్‌ పార్టీ తెలంగాణ ప్రజలకు బాకీ ఉందని, దీనిని మరచిపోయి ఆ పార్టీ నాయకులు మాట్లాడడం సరైంది కాదని కాంగ్రెస్‌ పార్టీ సిరిసిల్ల నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ కేకే మహేందర్‌రెడ్డి మండిప డ్డారు. సిరిసిల్ల పట్టణంలోని కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరులు సమావేశంలో అయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అధికారం లోకి వచ్చిన బీఅర్‌ఎస్‌ ప్రభుత్వం రూ 8లక్షల 50 వేల కోట్ల అప్పులు చేసి తెంగాణ ప్రజలకు బాకీ పడిందన్నారు. రాష్ట్రం లో ఉనికిని కొల్పోతున్నామని గమినిచించి మాజీ సీఎం కేసీ ఆర్‌ కుటుంబం జరిగే స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు ఉప ఎన్నికల్లో మళ్లీ పోటీ చేసి గెలుపొందేందుకు కాంగ్రెస్‌ పార్టీ ఇచ్చిన హామీలను నేరవేర్చాలంటూ- బాకీ కార్డులను విడుదల చేసి డ్రామాలు అడుతున్నారని ఆరోపించారు. కుటుంబ కలహాలను కప్పిపుచ్చుకోవడా నికి కొత్త డ్రామాలు ఆడుతూ కుట్రలు పన్నుతున్నారని అన్నారు. పది సంవత్సరాల పాలనలో బీఆర్‌ఎస్‌ పార్టీ అధికారంలో ఉండి సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు అమలుచేయలేక రాష్ట్ర ప్రజలకు బాకీ పడిందన్నారు. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ పార్టీ 20 నెలల్లో రాష్ట్ర సీఎం రేవంత్‌రెడ్డి పాలనలో దేశంలో ఎక్కడా లేనివిధం గా సంక్షేమ పథకాలను ప్రారంభించి అర్హులైన వారందరికి అందించ డంతోపాటు అనేక అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టి ఇంటింటికి అంది స్తామన్నారు. బీఅర్‌ఎస్‌ పార్టీకి చెందిన నాయకులు మాజీ మంత్రి కేటీఆర్‌ అండను చూసుకొని సిరిసిల్లలో సహజ వనరులను కొల్లగొట్టి అవినీతి అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించారు. మాజీ సీఎం కేసీఅర్‌ కుటుంబం చెప్పే మాటలను ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరన్నారు. జరిగే ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ విజయకేతనం ఎగురవేస్తుందన్నారు. ఈ సమావేశంలో పట్టణ అధ్యక్షుడు చొప్పదండి ప్రకాష్‌, ఎస్సీ సెల్‌ అధ్యక్షుడు అకునూరి బాలరాజు, రాగుల జగన్‌, భూక్య రెడ్డినాయక్‌, గంభీరావుపేట ప్రశాంత్‌గౌడ్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Oct 12 , 2025 | 12:44 AM