Share News

బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం రంగురంగుల బ్రోచర్‌లకే పరిమితమైంది..

ABN , Publish Date - Sep 10 , 2025 | 12:58 AM

బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం పదేళ్ల పాలనలో రంగురంగు బ్రోచర్‌లకే పరిమిత మైందని, అభివృద్ధి ఎక్కడ జరగలేదని, కాంగ్రెస్‌ ప్రభుత్వం హం గుఆర్భాటాలకు పోకుండా క్షేత్రస్థాయిలో అభివృద్ధి చేసి ప్రజల కళ్ళముందుంచుతుందని ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌ అన్నారు.

బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం రంగురంగుల బ్రోచర్‌లకే పరిమితమైంది..

వేములవాడ టౌన్‌, సెప్టెంబరు 9 (ఆంధ్రజ్యోతి): బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం పదేళ్ల పాలనలో రంగురంగు బ్రోచర్‌లకే పరిమిత మైందని, అభివృద్ధి ఎక్కడ జరగలేదని, కాంగ్రెస్‌ ప్రభుత్వం హం గుఆర్భాటాలకు పోకుండా క్షేత్రస్థాయిలో అభివృద్ధి చేసి ప్రజల కళ్ళముందుంచుతుందని ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌ అన్నారు. వేములవాడ పట్టణంలోని 9,10,11,12, వార్డుల్లో పలు కుల సం ఘ భవనాల నిర్మాణానికి మంజూరైన ప్రొసీడింగ్‌ కాపీలను మంగళవారం అందజేశారు. ఈ సందర్భంగా ఆది శ్రీనివాస్‌ మా ట్లాడుతూ గతంలో ఎన్నడూ లేని విధంగా పట్టణంలో పలు కుల సంఘాల నిర్మాణానికి పెద్ద ఎత్తున నిధులు అందజేస్తున్నా మన్నారు. ఇప్పటి వరకు పట్టణంలో 43 కుల సంఘాలకు రూ. 2 కోట్ల 50లక్షల నిధులు మంజూరుచేసి ప్రొసీడింగ్‌లు అంద జేసిన ఘనత కాంగ్రెస్‌ ప్రభుత్వానిదని సూచించారు. కుల సంఘాల్లో స్థానికులు సమావేశాలు, పండగలు చేసకునే అవకాశం ఉటుందని అన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి ప్రభుత్వం పట్టణంలో ఇల్లు లేని పేద వారికి మొదటి సారిగా 400 పైచిలుకు ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చామని అన్నారు. వాటిలో సుమారు 300 ఇండ్లు బేస్మెంట్‌ లెవల్‌ దాటి నిర్మాణ దశలో ఉన్నాయని తెలిపారు. ఇప్పటికే వేములవాడ దేవాలయ అభి వృద్ధి, రోడ్డు వెడల్పు పనులు ప్రారంభం అయ్యాయని అన్నారు. గత ప్రభుత్వం మూలవాగుపై మూడవ బ్రిడ్జి లేకున్న ఉన్నట్లు చూపించార ని విమర్శించారు. గత 52 యేళ్లుగా ఎదురు చూసిన రోడ్డు వెడల్పు పనులు ముందుకు సాగుతున్నాయని, పెరుగుతున్న పట్టణ జనాభాకు అనుగుణంగా అభివృద్ధి చేస్తున్నామని వివరించారు. పట్టణంలోని జరిగే అభివృద్ధి పనులను చూసి మంచి చేసే వారికి మద్దతు ఇవ్వా లని కోరారు. ప్రజలవద్దకే ప్రభుత్వం వస్తుందని, సమస్యలు ఉంటే నేరుగా తనవద్దకే రావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో రొండి రాజు, కనికరపు రాకేష్‌, బింగి మహేష్‌, సిరిగిరి శ్రీకాంత్‌, చిలుక రమే ష్‌ తదితరులు ఉన్నారు.

Updated Date - Sep 10 , 2025 | 12:58 AM