Share News

జనాభా పెరిగినా జననాల రేటు తగ్గుతోంది

ABN , Publish Date - Jul 12 , 2025 | 12:15 AM

దేశంలో జనాభా పెరుగుతున్నప్పటికి జననాల రేటు తగ్గుతుందని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్‌ వెంకటరమణ అన్నారు. ప్రపంచ జనాభా దినోత్సవాన్ని పురస్కరించుకుని అవగాహన ర్యాలీని శుక్రవారం నిర్వహించారు.

జనాభా పెరిగినా జననాల రేటు తగ్గుతోంది
రాలీని ప్రారంభిస్తున్న డీఎంహెచ్‌వో డాక్టర్‌ వెంకటరమణ

సుభాష్‌నగర్‌, జూలై 11 (ఆంధ్రజ్యోతి): దేశంలో జనాభా పెరుగుతున్నప్పటికి జననాల రేటు తగ్గుతుందని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్‌ వెంకటరమణ అన్నారు. ప్రపంచ జనాభా దినోత్సవాన్ని పురస్కరించుకుని అవగాహన ర్యాలీని శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్త్రీ చదువుకోవడం, వివాహ వయస్సు పెరగడం, అందుబాటులో ఉన్న గర్భనిరోధక సాధనాలు, జీవన వ్యయం పెరగడం, వృత్తి, కేరీర్‌పై దృష్టి సారించడం వల్ల జననాల రేటు తగ్గుతుందన్నారు. మన ప్రభుత్వం జనాభా స్థిరీకరణకు ప్రతి జిల్లా కేంద్రంలో మాతా శిశు ఆరోగ్య కేంద్రాలను ఏర్పాటు చేసిందన్నారు. అనంతరం కుటుంబ నియంత్రణ శస్త్ర చికిత్సలో బెస్ట్‌ సర్జన్లుగా డాక్టర్‌ మహ్మద్‌ అలీమ్‌, డాక్టర్‌ నిఖత్‌పర్వీన్‌, డాక్టర్‌ శ్రీకాంత్‌రెడ్డిని సన్మానించారు. కార్యక్రమంలో జిల్లా అదనపు వైద్యఆరోగ్యశాఖ అధికారి డాక్టర్‌ సుధ, డీటీసీవో డాక్టర్‌ రవీందర్‌రెడ్డి, డీటీటీ పీవో డాక్టర్‌ ఉమశ్రీ, డీఐవో డాక్టర్‌ సాజిదా, ఎన్‌సీడీ పీవో డాక్టర్‌ విప్లవశ్రీ, ఎంసీహెచ్‌ పీవో డాక్టర్‌ సనా జవేరియా, డెమో రాజగోపాల్‌, ఎన్‌హెచ్‌ఎం డీపీవో స్వామి, ఎస్‌వో వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.

Updated Date - Jul 12 , 2025 | 12:15 AM