Share News

బహుజన ముద్దు బిడ్డ సర్వాయి పాపన్న

ABN , Publish Date - Aug 18 , 2025 | 12:00 AM

గోల్కొండ కోటపై జెండా ఎగరేసిన బహుజనుల ముద్దుబిడ్డ సర్వాయి పాపన్న అని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ కుమార్‌ అన్నారు. సర్దార్‌ పాపన్న జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని కరీంనగర్‌ శివారులో సర్వాయి పాపన్న గౌడ్‌ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు.

బహుజన ముద్దు బిడ్డ సర్వాయి పాపన్న

భగత్‌నగర్‌, ఆగస్టు 18(ఆంధ్రజ్యోతి): గోల్కొండ కోటపై జెండా ఎగరేసిన బహుజనుల ముద్దుబిడ్డ సర్వాయి పాపన్న అని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ కుమార్‌ అన్నారు. సర్దార్‌ పాపన్న జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని కరీంనగర్‌ శివారులో సర్వాయి పాపన్న గౌడ్‌ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సదర్భంగా ఆయన మాట్లాడుతూ సామాన్య కల్లు గీత కుటుంబంలో జన్మించి నాటి మొఘల్‌ చక్రవర్తుల వెన్నులో వణుకు పుట్టించిన అసామాన్యుడు మన సర్దార్‌ సర్వాయి పాపన్న గౌడ్‌ అన్నారు. ఆనాటి మొఘల్‌ చక్రవర్తుల నిరంకుశ పాలనను, స్థానిక జమిందారులు, జాగీర్‌ దారులు, దేశ్‌ ముఖ్‌లు, భూస్వా ముల దోపిడీని, దౌర్జన్యాలను ఎదిరించాడన్నారు. ఒక్కనితో ప్రారంభమైన సర్దార్‌ పాపన్న పోరాటం సబ్బండ కులాల పీడిత ప్రజలను సమీ కరించుకొని సైన్యాన్ని ఏర్పాటు చేసుకుని.. గెరిల్లా పోరా టాలు చేస్తూ తన స్వస్థలం ఖిలాషాపూర్‌ రాజధానిగా పాలన సాగించాడన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ కరీంనగర్‌ జిల్లా అధ్యక్షులు గంగాడి క్రిష్ణారెడ్డి, మాజీ మేయర్‌ సునీల్‌రావు, సర్వాయి పాపన్న గౌడ్‌ రాష్ట్ర అధ్యక్షుడు కోడూరి పర్శరాములు గౌడ్‌, జిల్లా అధ్యక్షలు బుర్ర పర్శరాములు గౌడ్‌, గణగోని సత్తన్న గౌడ్‌, పడాల రమేశ్‌ గౌడ్‌, బుర్ర కనకయ్య గౌడ్‌, పతంగి అనిల్‌ గౌడ్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Aug 18 , 2025 | 12:00 AM