విద్యా విప్లవానికి నాంది.. యంగ్ ఇండియా స్కూల్
ABN , Publish Date - Nov 24 , 2025 | 11:46 PM
విద్యా విప్లవానికి నాందిగా యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ నిలుస్తుందని ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం అన్నారు. మండలంలోని రుక్మాపూర్‌లో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్‌కు సోమవారం శంకుస్థాపన చేశారు.
చొప్పదండి, నవంబరు 24 (ఆంధ్రజ్యోతి): విద్యా విప్లవానికి నాందిగా యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ నిలుస్తుందని ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం అన్నారు. మండలంలోని రుక్మాపూర్‌లో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్‌కు సోమవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ ఆధునిక విద్యా సంస్థను 200 కోట్ల వ్యయంతో అంతర్జాతీయ ప్రమాణాల సదుపాయాలతో నిర్మించనున్నామన్నారు. ఈ పాఠశాలతో గ్రామీణ ప్రాంతాల్లోని విద్యార్థులకు ప్రపంచస్థాయి విద్య అందుబాటులోకి వస్తుందని తెలిపారు. చొప్పదండి నియోజకవర్గాన్ని విద్యా హబ్‌గా అభివృద్ధి చేయడమే తన లక్ష్యమన్నారు. స్కూల్‌ను మంజూరు చేసినందుకు సీఎం రేవంత్ రెడ్డికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ అశ్విని తానాజీ వాఖడే, డీఈవో శ్రీరామ్ మొండయ్య పాల్గొన్నారు.
ఫ ఇందిరా మహిళాశక్తి కార్యక్రమంలో భాగంగా చొప్పదండిలో ఇందిరమ్మ చీరలను స్వయం సహాయక సంఘ సభ్య మహిళలకు ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం పంపిణీ చేశారు.