Share News

నిర్వాసితులతో అధికారుల తీరు సరికాదు

ABN , Publish Date - Jun 19 , 2025 | 12:46 AM

ప్రత్యర్థి దేశాలతో యుద్ధం చేసే సమయంలో వ్యవహరించే విధంగానే వేములవా డ ప్రధాన రహదారి విస్తరణ నిర్వాసితులతో అధికారులు వ్యవ హరిస్తున్నారని బీఆర్‌ఎస్‌ వేములవాడ నియోజకవర్గ ఇన్చార్జి చల్మెడ లక్ష్మీనరసింహారావు ఆగ్రహం వ్యక్తం చేశారు.

నిర్వాసితులతో అధికారుల తీరు సరికాదు

వేములవాడ, జూన్‌ 18 (ఆంధ్రజ్యోతి) : ప్రత్యర్థి దేశాలతో యుద్ధం చేసే సమయంలో వ్యవహరించే విధంగానే వేములవా డ ప్రధాన రహదారి విస్తరణ నిర్వాసితులతో అధికారులు వ్యవ హరిస్తున్నారని బీఆర్‌ఎస్‌ వేములవాడ నియోజకవర్గ ఇన్చార్జి చల్మెడ లక్ష్మీనరసింహారావు ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం నాడు వేములవాడలోని తన క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో లక్ష్మీనరసింహారావు మాట్లాడు తూ రోడ్డు వెడల్పు నిర్వాసితులతో అధికారులు వ్యవహరించిన తీరు పట్ల ఆయన తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. రోడ్డు వెడల్పు లో భాగంగా ఇండ్లు, భవనాలు కోల్పోతున్న నిర్వాసితులకు తగి న పరిహారం అందించకుండానే, వారికి తగినంత సమయం ఇవ్వకుండానే తెల్లవారుజామునే ప్రొక్రెయిన్లతో వచ్చి కూల్చివే తలు ప్రారంభించడం ఎంతవరకు సమంజసమని ఆయన ప్రశ్నించారు. ఇళ్లలోని సామగ్రిని తరలించక ముందే వందలాది మంది పోలీసులతో వచ్చి బలవంతంగా ఇళ్లు కూల్చివేయాల్సినంత అవసరం ఏం వచ్చిందని నిలదీశారు. ఇళ్లు కోల్పోతున్న నిర్వాసితుల పట్ల అధికార యంత్రాంగం కనీస మానవతా దృక్పథంతో వ్యవహ రించలేదని, ఏమాత్రం సమయం ఇవ్వకుండానే ఇళ్లు, దుకాణాల్లో సామగ్రి ఉండగానే బలవంతంగా కూల్చివేతలు ప్రారంభించారని విమ ర్శించారు. రహదారి విస్తరణకు తాము వ్యతిరేకం కాదని నిర్వాసితులు సైతం పదేపదే చెబుతున్నప్పటికీ మానవీయ కోణంలో ఆలోచించి తగినంత గడువు ఇచ్చిన తర్వాత కూల్చివేతలు ప్రారంభించేందుకు చొరవ చూపించాల్సిన స్థానిక ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్‌ నిర్వాసితులతో కనీసం సమావేశం కావడానికి కూడా ఇష్టపడలేదని, వారి బాధలను, మనోవేదనను అర్థం చేసుకునేందుకు ప్రయత్నించలేదని ఆరోపించారు. నిర్వాసితులకు చదరపు అడుగుకు 30 వేల రూపాయల చొప్పున పరి హారం చెల్లిస్తామని ముందుగా ప్రకటించిన అధికారులు, ఆ తర్వాత పత్తా లేకుండా పోయారని, పరిహారం గురించి నిర్వాసితులు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ కాళ్లు అరిగేలా తిరిగినప్పటికీ అధికారులు స్పం దించలేదని, ఇళ్లు కోల్పోతున్న వారికి పరిహారం చెల్లించే విషయంలో, పరిహారానికి సంబంధించిన తగిన సమాచారం అందించే విషయంలో ప్రభుత్వం, అధికారులు పూర్తిగా విఫలమయ్యారని అన్నారు. వేముల వాడ ప్రధాన రహదారి విస్తరణ సందర్భంగా అధికారులు వ్యవహరిం చిన తీరుతో తాము ప్రజాస్వామ్యంలో ఉన్నామా లేక రాచరికంలో ఉన్నామా అనే అనుమానం తలెత్తుతోందని లక్ష్మీనరసింహారావు అన్నా రు. పరిహారం చెల్లింపు విషయంలోనూ అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరించారని, ఒకరికి కేవలం 11వేల రూపాయల చొప్పున లెక్కిం చగా, మరొకరికి లక్ష యాభై ఆరు వేల రూపాయల చొప్పున చెల్లించా రని, ఇంత తేడా ఎలా సాధ్యమని ప్రశ్నించారు. రోడ్డు వెడల్పు నిర్వాసి తులను కాంగ్రెస్‌ ప్రభుత్వం అన్ని రకాలుగా మోసం చేసిందని, బీఆర్‌ ఎస్‌ ప్రభుత్వ హయాంలో బద్ది పోచమ్మ ఆలయ విస్తరణ కోసం, రాజ న్న ఆలయ విస్తరణ కోసం చేపట్టిన భూసేకరణలో ఒక్కరు కూడా బాధపడకుండా సమన్వయంతో వ్యవహరించామని, న్యాయమైన పరి హారం అందజేశామని గుర్తు చేశారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి నిర్వాసితులకు తగిన పరిహారం చెల్లించి వారికి న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు. కోడెల సంరక్షణకు గోశాల ఏర్పాటు చేయాలన్న ప్ర భుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని, కోడెల విషయంలో తాము చేసి న పోరాటం వల్లనే ప్రభుత్వం గోశాల ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్న దన్నారు. ఈ సమావేశంలో పట్టణ ప్రధాన కార్యదర్శి క్రాంతి కుమార్‌, సీనియర్‌ నాయకులు పోలాస నరేందర్‌, మాజీ కౌన్సిలర్లు నిమ్మశెట్టి వి జయ్‌, జోగిని శంకర్‌, నరాల శేఖర్‌, గోలి మహేష్‌, సీనియర్‌ నాయకు లు కొండ కనుకయ్య, ముద్రకోల వెంకటేశం, గుడిసె సదానందం, కు మ్మరి శ్రీనివాస్‌, వెంగళ శ్రీకాంత్‌ గౌడ్‌, అంజద్‌ పాషా, సయ్యద్‌ బాబా, వెంకట్‌ రెడ్డి, సత్యనారాయణరెడ్డి, అనిల్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jun 19 , 2025 | 12:46 AM