రేషన్ దుకాణాలను తీసివేయాలన్న ప్రయత్నం విరమించుకోవాలి
ABN , Publish Date - Dec 18 , 2025 | 01:02 AM
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రేషన్ దుకాణాలను తీసివేయాలన్న ప్రయత్నాన్ని విరమించుకోవాలని ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, సివిల్ సప్లయీస్ హమా లి కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సంటి బాలరాజు అన్నారు.
సిరిసిల్ల టౌన్, డిసెంబరు 17 (ఆంధ్రజ్యోతి): కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రేషన్ దుకాణాలను తీసివేయాలన్న ప్రయత్నాన్ని విరమించుకోవాలని ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, సివిల్ సప్లయీస్ హమా లి కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సంటి బాలరాజు అన్నారు. బుధవారం రాజ న్న సిరిసిల్ల జిల్లా కేంద్రం కార్మిక భవనంలో ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి కడారి రాములు అధ్యక్షతన జిల్లా సివిల్ సప్లైయ్ హమాలి కార్మిక సంఘం జిల్లా ప్రథమ మహాసభ జరిగింది. ముందుగా కార్మిక భవ నం ఎదుట ముఖ్యఅతిథి బాలరాజు ఏఐటీ యూసీ జెండాను ఆవిష్కరించిన అనంతరం ప్రథమ మహాసభలో మాట్లాడారు. రెండు సంవత్సరాలకు ఒకసారి హమాలీల కూలి పెంచాలని మహిళలకు అన్ని సదుపాయాలు ప్రభుత్వాలు కల్పించాలని డిమాండ్ చేశారు. సొంత గోడౌన్‌లు ఉండేలా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలన్నారు. హమాలీలకు ప్రభుత్వాలే ఇన్సూరెన్స్ కల్పించాలని ప్రమా దాలు జరిగినపుడు గాయపడిన హమా లీలకు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. హమాలీ కార్మికులు హక్కుల కోసం ఐక్యంగా పోరాటాలు చేయాలని అన్నారు. అనంతరం జిల్లా సివిల్ సప్లైయ్ హమాలి కార్మిక సంఘం నూతన కార్యవర్గంను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జిల్లా అధ్యక్షుడు గంగపురం పోచమల్లు, ప్రధాన కార్యదర్శి పుప్పాల రాజేష్, ఉపాధ్యక్షుడు బోగి వెంకటేశం, కోశాధికారి పుప్పాల దుర్గయ్య, సహాయ కార్యదర్శులు వేల్పుల కనకరాజు, రాగుల ఎల్లయ్య, గౌరవ అధ్యక్షుడు కడారి రాములు, ముఖ్య సలహాదారుడు అజ్జ వేణు, కౌన్సిల్ సభ్యులుగా అనుముల లచ్చయ్య, సాయిలు, కిరణ్, దుర్గయ్య, రాములు, మల్ల య్య, వెంకటేశం, దేవయ్య, మారుతిని ఎన్ను కున్నారు. ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యదర్శి మంద సుదర్శన్, సిద్దిపేట జిల్లా ఏఐటీయూసీ ప్రధాన కార్యదర్శి కిష్టాపురం లక్ష్మన్, నాయకుడు బచ్చుపల్లి శంకర్, సిరి సిల్ల, వేములవాడ హమాలీ కార్మిక సంఘాల నాయకులు, కార్మికులు పాల్గొన్నారు.