మహనీయుల ఆశయాలను భావితరాలకు తెలియజేయాలి
ABN , Publish Date - Aug 27 , 2025 | 12:49 AM
జిల్లా కేం ద్రంలో మహత్మా జ్యోతిబాఫూలే, సావిత్రీబాయి ఫూలే విగ్రహాలను ఏర్పాటు చేసుకోవడం శుభపరి ణామని, మహానీయుల ఆశయాలను ముందు తరాలకు తెలిసేలా చూడాలని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు.
సిరిసిల్ల, ఆగస్టు 26 (ఆంధ్రజ్యోతి): జిల్లా కేం ద్రంలో మహత్మా జ్యోతిబాఫూలే, సావిత్రీబాయి ఫూలే విగ్రహాలను ఏర్పాటు చేసుకోవడం శుభపరి ణామని, మహానీయుల ఆశయాలను ముందు తరాలకు తెలిసేలా చూడాలని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. మంగళవారం సిరిసిల్లలో అం బేడ్కర్ చౌరస్తా వద్ద ఏర్పాటు చేసిన ఫూలే దంప తుల విగ్రహాలను ఆవిష్కరించారు. జిల్లాకు వచ్చి న చేనేత జౌళిశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావుతోపాటు వివిధ సంఘాల నాయకులు ఫూలే దంపతుల విగ్రహాలకు పూలమాలలు వేశారు. బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఫోన్ ద్వారా విగ్రహావిష్కరణ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆది మాట్లాడుతూ విచక్షణ వెట్టి చాకిరి తొలగించాలని, ఈ సమాజంలోని పేద బిడ్డలు ముందుకు పోవాలని అన్ని అసమానతలు పోవాలని పోరాటం చేశారన్నారు. అంటరానిత నం, కుల వ్యవస్థ నిర్మూలన రూపుమాపి ఆడ పిల్లలకు చదువే ఆయుధం అని అనేక పాఠశాల లు నెలకొల్పి విద్యను అందించిన మహనీయులని అన్నారు. ఆదర్శ దంపతులు విగ్రహాలు గ్రంథాల యం ముందు ఏర్పాటు చేసుకోవడం అభినందనీ యమన్నారు. హైదరాబాద్‌లో మంత్రి పొన్నం ప్రభాకర్‌తో కలిసి మహత్మా జ్యోతిబాఫూలే జీవిత కథ ఆధారంగా నిర్మించిన సినిమాను చూడటం జరిగిందన్నారు. కాంగ్రెస్ సిరిసిల్ల నియోజకవర్గ ఇంచార్జి కేకే మహేందర్‌రెడ్డి మాట్లాడుతూ అణ గారిన వర్గాలకు అక్షర జ్ఞానాన్ని జ్యోతిబాపూలే దంపతులను అదర్శంగా తీసుకోవాలన్నారు. కార్యక్రమం లో జిల్లా గ్రంథాలయ చైర్మన్ నాగుల సత్యనారా యణ గౌడ్, మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్ స్వరూప తిరుపతిరెడ్డి, జిల్లా ముదిరాజ్ సంఘం అధ్యక్షుడు చొక్కల రాము, కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు చొప్ప దండి ప్రకాష్, ఏఐసీసీ కార్యవర్గ సభ్యుడు సంగీతం శ్రీనివాస్, అంబేద్కర్ సంఘం జిల్లా అధ్యక్షుడు కత్తెర దేవదాస్, విగ్రహదాత మోతే బాబు ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు ఆకునూరి బాలరాజు, బీసీ సంఘం అధ్యక్షుడు పర్ష హనుమండ్లు,మున్నూరుకాపు జిల్లా అధ్యక్షుడు బొప్ప దేవయ్య, పద్మశాలి సంఘం అధ్యక్షుడు కోరి వెంకటరమణ, ముదిరాజ్ సంగం అధ్యక్షుడు వంకాయల కార్తి,విగ్రహ కమిటీ సమన్వయకర్త గడ్డం నర్స య్య, సభ్యులు బొజ్జ కనకయ్య అంకని భాను, కర్ణాల భద్రాచలం, రామచంద్రం, రాగుల రాము లు, మల్లేశం, వెంకన్న గంగాధర్, కల్లూరి చందన, సూర దేవరాజు, సుంక నాగరాజు, మల్లేశం తదిత రులు పాల్గొన్నారు.