Share News

అసెంబ్లీలో బీసీ బిల్లు ఆమోదం చరిత్రాత్మకం

ABN , Publish Date - Sep 01 , 2025 | 12:18 AM

పంచాయతీరాజ్‌ చట్ట సవరణ బిల్లును తెలంగాణ శాసనసభ ఏకగ్రీవంగా ఆమోదించడంపై కాంగ్రెస్‌ నగర అధ్యక్షుడు, సుడా చైర్మన్‌ కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డి హర్షం వ్యక్తం చేశారు.

అసెంబ్లీలో బీసీ బిల్లు ఆమోదం చరిత్రాత్మకం

గణేశ్‌నగర్‌, ఆగస్టు 31 (ఆంధ్రజ్యోతి): పంచాయతీరాజ్‌ చట్ట సవరణ బిల్లును తెలంగాణ శాసనసభ ఏకగ్రీవంగా ఆమోదించడంపై కాంగ్రెస్‌ నగర అధ్యక్షుడు, సుడా చైర్మన్‌ కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. శాసనసభలో బీసీ రిజర్వేషన్‌ బిల్లు ఆమోదం పొందిన సందర్భంగా సిటీ కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో ఇందిరా చౌక్‌లో టపాసులు కాల్చి స్వీట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డి మాట్లాడుతూ కామారెడ్డి డిక్లరేషన్‌లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను కల్పిస్తామని కాంగ్రెస్‌ పార్టీ హామీ ఇచ్చిందన్నారు. అధికారం లోకి వచ్చిన తర్వాత ఆ హామీని నెరవేర్చే దిశగా అడుగులు వేస్తోందని తెలిపారు. కార్యక్రమంలో కొరివి అరుణ్‌కుమార్‌, సమద్‌ నవాబ్‌, గుండాటి శ్రీనివాస్‌రెడ్డి, సయ్యద్‌ కమురొద్దీన్‌, చర్ల పద్మ, కుర్ర పోచయ్య, షబానా మహమ్మద్‌, అస్తపురం తిరుమల, నెల్లి నరేష్‌, పెద్దిగారి తిరుపతి, వంగల విద్యాసాగర్‌, నాగుల సతీష్‌, మిరాజ్‌, షెహన్షా, చింతల కిషన్‌, చర్ల లింగయ్య, బారి, బషీర్‌, లింగమూర్తి, ఫహాద్‌, అజీం, తాళ్లపల్లి శ్రీకాంత్‌, అంజయ్య, సాయిరాం ఖలీల్‌, శిల్ప పాల్గొన్నారు.

Updated Date - Sep 01 , 2025 | 12:18 AM