మహాగౌరి అలంకారంలో అమ్మవారి దర్శనం
ABN , Publish Date - Sep 30 , 2025 | 11:49 PM
వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి ఆలయంలో దుర్గాష్టమిని పురస్కరించుకుని అమ్మవారు మహాగౌరి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు.
వేములవాడ కల్చరల్, సెప్టెంబరు 30 (ఆంధ్రజ్యోతి): వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి ఆలయంలో దుర్గాష్టమిని పురస్కరించుకుని అమ్మవారు మహాగౌరి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. శ్రీదేవినవరాత్రి ఉత్సవాలలో భాగంగా తొమ్మిదో రోజు మంగళవారం ఆలయ అర్చకులు శ్రీరాజరాజేశ్వర స్వామి ఆలయంలో గోపూజతో కార్యక్రమాలను ప్రారంభించారు. శ్రీలక్ష్మీగణపతికి మహాభిషేకం, శ్రీరాజరాజేశ్వర స్వామి వారికి మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం ఘనంగా నిర్వహించారు. శ్రీరాజరాజేశ్వరీదేవికి 108 మంది బ్రహ్మణులతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అలాగే రాజన్న ఆలయంలో చండీహోమం ఘనంగా నిర్వహించారు. మహిషాసురమర్థిని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.