భూ సమస్యల పరిష్కారమే ‘భూ భారతి’ లక్ష్యం
ABN , Publish Date - Apr 27 , 2025 | 12:51 AM
భూ సమస్యల పరి ష్కారమే లక్ష్యంగా ప్రభుత్వం నూతన ఆర్వోఆర్, భూ భారతి చట్టం రూపకల్పన చేసిందని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అన్నారు.
తంగళ్ళపల్లి, ఏప్రిల్ 26 (ఆంధ్రజ్యోతి): భూ సమస్యల పరి ష్కారమే లక్ష్యంగా ప్రభుత్వం నూతన ఆర్వోఆర్, భూ భారతి చట్టం రూపకల్పన చేసిందని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అన్నారు. శనివారం తంగళ్ళపల్లి మండల కేంద్రంలోని ఫంక్షన్ హాల్‌లో నిర్వహించిన భూ భారతి చట్టం అవగాహన కార్యక్ర మంలో కలెక్టర్ పాల్గొన్నారు. భూ భారతి చట్టంలోని వివిధ అం శాలను కలెక్టర్ రైతులకు, ప్రజలకు పవర్ పాయింట్ ప్రజెంటే షన్ ద్వారా వివరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ భూ సమస్యల పరిష్కరించడమే లక్ష్యంగా ప్రభుత్వం రూపొం దించిన భూ భారతి చట్టం-2025 అమల్లోకి వచ్చిందని, ముందు గా రాష్ట్రంలోని 4మండలాలలో పైలెట్ ప్రాజెక్టు కింద ఈ చట్టం అమలు చేస్తున్నారన్నారు. వారసత్వం లేదా వీలునామా ద్వారా భూమిపై హక్కుల సంక్రమిస్తే తహసీల్దార్ విచారణ జరిపి హక్కుల రికార్డుల్లో మ్యూటేషన్ చేస్తారని, నిర్ణీత గడువు 30 రోజుల లోగా పూర్తిచేయకుంటే ఆటోమేటిక్‌గా మ్యూటేషన్ జరుగుతుందని అన్నారు. భూముల రిజిస్ట్రేషన్ మ్యూటేషన్ సమయంలో తప్పనిసరిగా భూమి పటం అందుబాటులో ఉండాలని, మండలాల్లో లైసెన్స్ సర్వే యర్ల ద్వారా భూమి మ్యాప్ తయారుచేస్తేనే రిజిస్ట్రేషన్, మ్యుటేషన్ జరిగేలా చట్టంలో వ్యవస్థ కల్పించామన్నారు. ప్రస్తుతం ధరణి లో ఉన్న భూ రికార్డులు భూభారతి చట్టంలో కొనసాగుతాయని తెలిపారు. భూ హక్కుల రికార్డుల్లో తప్పుల సవరణకు అర్హులైన వారు జిల్లాలో నూత న చట్టం అమల్లోకి వచ్చిన ఏడాదిలోగా దరఖాస్తు చేసుకోవాలని, ఆ దరఖాస్తులను పరిశీలించి రెవెన్యూ డివిజన్ అధికారి, కలెక్టర్ నిర్ణయం తీసుకుంటారని, దరఖాస్తుదారునికి ఏమైనా అభ్యంతరాలుంటే కలెక్టర్, భూమి ట్రిబ్యూనల్‌లో అప్పీల్ చేసుకోవచ్చని తెలిపారు. భూ సమస్యల పై అధికారులు అందించిన ఆర్డర్లపై భూ భారతి చట్టం ప్రకారం ఆప్పీ ల్ చేసుకునే అవకాశం ఉందని, రెవెన్యూ డివిజన్ అధికారి నిర్ణయంపై కలెక్టర్ వద్ద, కలెక్టర్ నిర్ణయంపై భూమి ట్రిబ్యునల్ వద్ద అపీల్ చేసు కోవచ్చని, గతంలో ధరణి వ్యవస్థ ఉన్నప్పుడు ఏదైనా అభ్యంతరాలు ఉంటే సివిల్ కోర్టుకు మాత్రమే వెళ్లాల్సి ఉండేదని, ఇప్పుడు ఆ అవస రం లేకుండా అప్పీల్ వ్యవస్థకు అవకాశం కల్పించిందని అన్నారు. అప్పీల్ వ్యవస్థ అందించిన తీర్పు తర్వాత కూడా సంతృప్తి చెందకపో తే సివిల్ కోర్టు వెళ్ళవచ్చని, దరఖాస్తుదారులకు అవసరమైన ఉచిత న్యాయ సలహాను ప్రభుత్వం అందిస్తుందన్నారు. ప్రతి గ్రామంలో రెవె న్యూ రికార్డుల తయారుచేసి, ప్రతి సంవత్సరం గ్రామాలలో రికార్డు డిస్‌ప్లే చేస్తారన్నారు. రెవెన్యూ వ్యవస్థను బలోపేతం చేసేందుకు ప్రతి గ్రామంలో గ్రామపరిపాలన అధికారులను నియమించేందుకు ప్రభు త్వం చర్యలు తీసుకుంటుందన్నారు. మనిషికి ఆధార్ కార్డులాగా భూ మికి భూదార్ సంఖ్య కేటాయింపు ప్రణాళిక చేస్తుందని, దీని ద్వారా భూ ఆక్రమణలకు చెక్ పెట్టవచ్చన్నారు. పెండింగ్‌లో ఉన్న సాదా బైనామా పరిష్కారం కోసం భూ భారతి చట్టంలో ప్రభుత్వం అవకా శం కల్పించిందన్నారు. వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్, మ్యూటేషన్ ఒకేరోజు ఉంటాయన్నారు. కొనుగోలు, దానం తనకా, బదిలీ, భాగ పం పకాల ద్వారా భూమిపై హక్కులు సంక్రమిస్తే తహసీల్దార్ రిజిస్ట్రేషన్ చేసి హక్కుల రికార్డులు మార్పులు చేసి పట్టాదార్ పాస్‌పుస్తకం జారీ చేస్తారన్నారు. భూ భారతి చట్టంపై అవగాహన కల్పించేలా కరపత్రా లను పంపిణీ చేశామని, ప్రజలు వీటిని గమనించాలని ఏమైనా సందేహాలు ఉంటే తీర్చడానికి అధికారులు ఎప్పుడూ సిద్ధంగా ఉంటార ని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నాగుల సత్యనారాయణగౌడ్, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్ వెలుముల స్వరూప, సిరిసిల్ల ఆర్డీవో రాధాబాయి, వ్యవసాయ మార్కె ట్ కమిటీ వైస్‌చైర్మన్ నర్సింగం, తహసీల్దార్ జయంత్, సంజీవ్, తది తరులు పాల్గొన్నారు.