Share News

రైతులకు మద్దతు ధర అందించడమే లక్ష్యం

ABN , Publish Date - Oct 10 , 2025 | 12:14 AM

రైతులు కష్టపడి పండించిన ధాన్యానికి మద్దతు ధర అందించడమే లక్ష్యమని కలెక్టర్‌ ఎం హరిత స్పష్టం చేశారు.

రైతులకు మద్దతు ధర అందించడమే లక్ష్యం

సిరిసిల్ల, అక్టోబరు 9 (ఆంధ్రజ్యోతి) : రైతులు కష్టపడి పండించిన ధాన్యానికి మద్దతు ధర అందించడమే లక్ష్యమని కలెక్టర్‌ ఎం హరిత స్పష్టం చేశారు. గురువారం రాజన్న సిరిసిల్ల జిల్లా సమీకృత కార్యాల యాల సముదాయంలో ఖరీఫ్‌ సీజన్‌ 2025-26 ధాన్యం సేకరణపై పౌర సరఫరాల శాఖ, రెవెన్యూ, వ్యవసాయ శాఖ, రవాణా, మార్కెటిం గ్‌, సహకార, ఐకేపీ, మెప్మా ఇతర శాఖల అధికారులతో సమీక్ష నిర్వ హించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ గత ఖరీఫ్‌ సీజన్లో జిల్లాలో 2.11లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం సేకరించామని, ఈ సీజన్లో దాదాపు 2.70 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వస్తుందని వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేశారని తెలిపారు. ఈ మేరకు వ్యవసాయ శాఖ అధికారులు అప్రమత్తంగా ఉండాలని, ఏదైనా గ్రామాల్లో వరి కోతలు మొదలు అయితే తమ దృష్టికి తీసుకు రావాలని సూచించారు. వెంటనే ఆయా గ్రామాల్లో కొనుగోలు కేంద్రా లు ఏర్పాటు చేస్తామని తెలిపారు. అలాగే రైతులకు ధాన్యం కేంద్రా లకు ఎలా తరలించాలి, తేమ శాతం వివరాలు తెలిపి టోకెన్లు ఇవ్వా లని ఆదేశించారు. సన్న ధాన్యాన్ని నిర్ధారించి, దాని వివరాలు కొను గోలు కేంద్రాల బాధ్యులకు ఇవ్వాలని సూచించారు. ఐకేపీ, మెప్మా, పీఏసీఎస్‌, డీసీఎంఎస్‌ కొనుగోలు కేంద్రాల నిర్వాహకులకు ధాన్యం సేకరణ, రైతుల వివరాల నమోదు ఇతర అంశాలపై శిక్షణ ఇచ్చామని తెలిపారు. పౌర సరఫరాల శాఖ, రెవెన్యూ శాఖ అధికారులు నిరం తరం అప్రమత్తంగా ఉండాలని, కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం సేకర ణలో ఇబ్బందులు తొలగించాలని సూచించారు. ధాన్యం సేకరణ, రవా ణా, లారీలు ఇతర ఇబ్బందులు రాకుండా చూసుకోవాలని ఆదేశిం చారు. రైతులు తమ ధాన్యాన్ని తాలు, తప్పలేకుండా, తేమ శాతం 17 ఉండేలా చూసుకుని కేంద్రాలకు తరలించాలని సూచించారు. ప్రభు త్వం గ్రేడ్‌ ఏ రకం ధాన్యానికి క్వింటాలుకు రూ 2389, కామన్‌ రకా నికి రూ.2369 నిర్ణయించిదని వెల్లడించారు. సన్న ధాన్యానికి క్వింటా లుకు రూ 500 అదనంగా ఇస్తుందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదే శాల మేరకు జిల్లాలోని 13 మండలాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించనున్నట్లు తెలిపారు. ధాన్యాన్ని సేకరించేందుకు ఐకేపీ ఆధ్వ ర్యంలో 144, పీఏసీఎస్‌ 79, మెప్మా, డీసీఎంఎస్‌ ఆధ్వర్యంలో కలిపి 231 కేంద్రాలు ప్రారంభించనున్నట్లు తెలిపారు.

అందుబాటులో పరికరాలు..

జిల్లాలో అవసరం మేరకు అన్ని పరికరాలు అందుబాటులో ఉన్నా యని వెల్లడించారు. టార్పాలిన్లు 7592, తూకం వేసే యంత్రాలు 764, ప్యాడీ క్లీనర్లు 731, తేమ శాతం చూసే మెషిన్లు 603, గ్రైన్‌ కాలిపర్స్‌ 270ఇతర యంత్రాలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. జిల్లాలో ని రైతులు వీటిని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. సమీ క్షలో అదనపు కలెక్టర్‌ గడ్డం నగేష్‌, సిరిసిల్ల, వేములవాడ ఆర్డీవోలు వెంకటేశ్వర్లు, రాధాభాయ్‌ డీసీఎస్‌వో చంద్రప్రకాష్‌, జిల్లా మేనేజర్‌ రజి త, డీఏవో అఫ్జల్‌ బేగం, డీఆర్డీవో శేషాద్రి, డీసీవో రామకృష్ణ, డీఎంవో ప్రకాష్‌, ట్రైనీ డిప్యూటీ కలెక్టర్‌ నిఖిత తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Oct 10 , 2025 | 12:15 AM