Share News

నిందితులకు శిక్ష పడాలి..

ABN , Publish Date - May 21 , 2025 | 11:57 PM

నిందితులకు శిక్షలు పడేలా, బాధితులకు నష్టపరిహారం అందేలా భరోసా కేంద్రంలోని అధికారులు చర్యలు తీసుకోవాలని సీపీ గౌస్‌ ఆలం అన్నారు. కరీంనగర్‌ శివారులోని కొత్తపల్లిలో భరోసా కేంద్రాన్ని బుధవారం పోలీస్‌ కమిషనర్‌ గౌస్‌ ఆలం తనిఖీ చేశారు.

  నిందితులకు శిక్ష పడాలి..
సిబ్బందితో మాట్లాడుతున్న సీపీ గౌస్‌ ఆలం

- భరోసా కేంద్రాన్ని తనిఖీ చేసిన సీపీ గౌస్‌ ఆలం

కరీంనగర్‌ క్రైం, మే 21 (ఆంధ్రజ్యోతి) : నిందితులకు శిక్షలు పడేలా, బాధితులకు నష్టపరిహారం అందేలా భరోసా కేంద్రంలోని అధికారులు చర్యలు తీసుకోవాలని సీపీ గౌస్‌ ఆలం అన్నారు. కరీంనగర్‌ శివారులోని కొత్తపల్లిలో భరోసా కేంద్రాన్ని బుధవారం పోలీస్‌ కమిషనర్‌ గౌస్‌ ఆలం తనిఖీ చేశారు. తెలంగాణ పోలీసుశాఖలోని ఉమెన్‌ సేఫ్టీ వింగ్‌ ఆధ్వర్యంలో గత డిసెంబరులో ప్రారంభమైన ఈ కేంద్రం పనితీరును, బాధితులకు అందిస్తున్న సేవలను సీపీ అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా భరోసా కేంద్రంలోని సిబ్బందితో సీపీ మాట్లాడి రికార్డులను పరిశీలించి వాటిని సక్రమంగా నిర్వహించాలని సూచించారు. బాధితులకు భరోసా కేంద్రంలో అందించే సేవల గురించి అడిగి తెలుసుకున్నారు. కేసుల వివరాలను పరిశీలించిన సీపీ అధికారులకు సూచనలు, ఆదేశాలు జారీ చేశారు. లైంగిక వేధింపులకు గురైన మహిళలు, అసభ్యకరమైన లైంగిక ప్రవర్తనకులోనైన పిల్లలకు పోలీసు ఠాణాలు, ఆసుపత్రులకు దూరంగా సురక్షితమైన వాతావరణంలో చేయూతనందించేందుకు ప్రభుత్వవం భరోసా కేంద్రాలను ఏర్పాటు చేసిందన్నారు. బాధితులకు సేవలందించడంలో భరోసా కేంద్రాలు మంచి ఫలితాలు సాధిస్తున్నాయన్నారు. కార్యక్రమంలో ఏసీపీ మాధవి, సీఐ శ్రీలత, ఎస్‌ఐ అనూష పాల్గొన్నారు.

Updated Date - May 21 , 2025 | 11:57 PM