Share News

అభివృద్ధి పనుల టెండర్లు పూర్తి చేయాలి

ABN , Publish Date - Sep 19 , 2025 | 11:41 PM

నగరంలో చేపట్టాల్సిన అభివృద్ధి పనుల అగ్రిమెంట్లు, టెండర్‌ ప్రక్రియను వేగంగా పూర్తి చేయాలని మున్సిపల్‌ కమిషనర్‌ ప్రపుల్‌ దేశాయ్‌ ఇంజనీరింగ్‌ అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఆయన నగరపాలక సంస్థ కార్యాలయంలో ఇంజనీరింగ్‌ విభాగం అధికారులతో అభివృద్ధి పనులపై సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు.

అభివృద్ధి పనుల టెండర్లు పూర్తి చేయాలి
సమావేశంలో మాట్లాడుతున్న మున్సిపల్‌ కమిషనర్‌ ప్రపుల్‌ దేశాయ్‌

కరీంనగర్‌ టౌన్‌, సెప్టెంబరు 19 (ఆంధ్రజ్యోతి): నగరంలో చేపట్టాల్సిన అభివృద్ధి పనుల అగ్రిమెంట్లు, టెండర్‌ ప్రక్రియను వేగంగా పూర్తి చేయాలని మున్సిపల్‌ కమిషనర్‌ ప్రపుల్‌ దేశాయ్‌ ఇంజనీరింగ్‌ అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఆయన నగరపాలక సంస్థ కార్యాలయంలో ఇంజనీరింగ్‌ విభాగం అధికారులతో అభివృద్ధి పనులపై సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నగరపాలక సంస్థ పరిధిలో చేపట్టాల్సిన అభివృద్ధి పనుల అగ్రిమెంట్లను పూర్తి చేసి పనులు త్వరగా ప్రారంభమయ్యేలా చూడాలన్నారు. అసంపూర్తి పనులను పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని, అభివృద్ధి పనుల విషయంలో ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా చూడాలని ఆదేశించారు. సమావేశంలో ఎస్‌ఈ రాజ్‌కుమార్‌, ఈఈ రొడ్డ యాదగిరి, సంజీవ్‌కుమార్‌, డీఈలు లచ్చిరెడ్డి, ఓం ప్రకాష్‌, శ్రీనివాస్‌రావు, వెంకటేశ్వర్లు, ఏఈలు పాల్గొన్నారు.

ఫ తడి, పొడిచెత్తపై తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలి

తడి, పొడి చెత్తపై తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలని మున్సిపల్‌ కమిషనర్‌ ప్రఫుల్‌ దేశాయ్‌ విద్యార్థులకు పిలుపునిచ్చారు. శుక్రవారం ఆయన సప్తగిరికాలనీ ప్రభుత్వ ఉన్నత పాఠశాలను సందర్శించారు. స్వచ్చతా హీ సేవా కార్యక్రమంలో భాగంగా విద్యార్థినీ, విద్యార్థులకు పరిసరాల పరిశుభ్రత, తడిపొడి చెత్త వేరు చేయడం, ప్లాస్టిక్‌ నివారణ, హోం కంపోస్టింగ్‌ తయారు తదితర అంశాలపై అవగాహన కల్పించారు. అనంతరం విద్యార్థులు, ఉపాధ్యాయులతో కలిసి స్వచ్ఛతా హీ సేవా ప్రతిజ్ఞ చేయించారు. విద్యార్థులతో డివిజన్‌లోని కాలనీల్లో ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్‌ చాడగొండ బుచ్చిరెడ్డి, పారిశుధ్య విభాగం అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - Sep 19 , 2025 | 11:41 PM