Share News

పాత పద్ధతిలోనే ‘పది’ పరీక్షలు

ABN , Publish Date - Aug 18 , 2025 | 12:02 AM

పదో తరగతి పరీక్షలు పాత పద్ధతిలోనే జరుగనున్నాయి. రాత పరీక్షకు 80 మార్కులు, ఇంటర్నల్‌కు 20 మార్కులు యధావిధిగా కొనసా గిస్తున్నట్లు విద్యాశాఖ డైరెక్టర్‌ నవీన్‌ నికోలస్‌ ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో ఉపాధ్యాయ సంఘాలు ఇంటర్నల్‌ మార్కుల విధానాన్ని స్వాగతిస్తున్నప్పటికీ విద్యా సంవత్సరం ప్రారంభమై రెండు నెలలు గడచిన తర్వాత విద్యాశాఖ ఆదేశాలు ఇవ్వడంపై మరి కొంత మంది ఉపాధ్యాయు లు విచారం వ్యక్తం చేస్తున్నారు.

పాత పద్ధతిలోనే ‘పది’ పరీక్షలు

కరీంనగర్‌ టౌన్‌, ఆగస్టు 17 (ఆంధ్రజ్యోతి): పదో తరగతి పరీక్షలు పాత పద్ధతిలోనే జరుగనున్నాయి. రాత పరీక్షకు 80 మార్కులు, ఇంటర్నల్‌కు 20 మార్కులు యధావిధిగా కొనసా గిస్తున్నట్లు విద్యాశాఖ డైరెక్టర్‌ నవీన్‌ నికోలస్‌ ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో ఉపాధ్యాయ సంఘాలు ఇంటర్నల్‌ మార్కుల విధానాన్ని స్వాగతిస్తున్నప్పటికీ విద్యా సంవత్సరం ప్రారంభమై రెండు నెలలు గడచిన తర్వాత విద్యాశాఖ ఆదేశాలు ఇవ్వడంపై మరి కొంత మంది ఉపాధ్యాయు లు విచారం వ్యక్తం చేస్తున్నారు. విద్యాహక్కు చట్టం ప్రకారం 2011 నుంచి 80 మార్కులకు రాత పరీక్ష, 20 మార్కులకు ఇంటర్నల్స్‌ నిర్వహిస్తున్నారు. ప్రైవేట్‌ పాఠశాలల్లో ఆయా పాఠశాలల యాజమాన్యాలు విద్యార్థులకు 20కి 20 ఇంటర్నల్‌ మార్కులు వేస్తుండటంతో ప్రభుత్వ పాఠశాలల్లో ఉత్తీర్ణత శాతం పడిపోతుందని ప్రభుత్వం ఇంటర్నల్‌ మార్కుల విధానాన్ని రద్దు చేసి 2024-25 విద్యాసంవత్సరం నుంచి 100 మార్కులకు పదో తరగతి వార్షిక పరీక్షలు నిర్వహిస్తామని పేర్కొంది. ఉపాధ్యాయ సంఘాలు, ప్రైవేట్‌ స్కూల్‌ యాజమాన్యాలు వ్యతిరేకించడంతో ప్రభుత్వం గతేడాది తన నిర్ణయాన్ని వెనక్కు తీసుకుంది. 2025-26 నుంచి 100 మార్కులకు రాత పరీక్షలు నిర్వహి స్తామని ప్రభుత్వం ప్రకటించి రెండు నెలలు గడచిన తర్వాత పాత విధానాన్నే కొనసాగిస్తున్నట్లు విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది.

ఫ ఎస్‌సీఈఆర్‌టీ అభిప్రాయం మేరకే

పదోతరగతి ఇంటర్నల్‌ మార్కులను రద్దు చేయడంపై జాతీయ విద్యా పరిశోధనా శిక్షణా మండలి (ఎస్‌సీఈఆర్‌టీ) ప్రభుత్వాన్ని ప్రశ్నించినట్లు తెలుస్తోంది. సీబీఎస్‌ఈ పదో తరగతి పరీక్షల్లో 20 శాతం ఇంటర్నల్‌, 80 శాతం వార్షిక పరీక్షలకు మార్కులు కేటాయిస్తే తెలంగాణలో ఎలా ఇంటర్నల్స్‌ను రద్దు చేస్తారని ఇటీవల నిర్వహించిన వర్క్‌షాపులో రాష్ట్ర విద్యాశాఖ అధికా రులతో చర్చించినట్లు సమాచారం. దీంతో విద్యాశాఖ అధికారులు పాత విధానాన్నే కొనసాగిం చాలని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపపడంతో ప్రభుత్వం అంగీకరించగా విద్యాశాఖ అధికా రులు ఇంటర్నల్‌ విధానాన్ని యధావిధిగా అమలు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు.

Updated Date - Aug 18 , 2025 | 12:02 AM