మెడికల్ హబ్‌గా తెలంగాణ రాష్ట్రం
ABN , Publish Date - Aug 14 , 2025 | 11:27 PM
దేశంలోనే తెలంగా ణ రాష్ట్రం మెడికల్‌హబ్ గా మారిందని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అ న్నారు.
వేములవాడ టౌన్, ఆగస్టు 14 (ఆంధ్రజ్యో తి): దేశంలోనే తెలంగా ణ రాష్ట్రం మెడికల్‌హబ్ గా మారిందని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అ న్నారు. పట్టణంలోని ఎ మ్మెల్యే క్యాంపు కార్యల యంలో 40మంది లబ్ధి దారులకు సీఎం సహా య నిధి చెక్కులను గురువారం పంపిణీ చేశారు. ఈ సందర్భం గా ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమం త్రిగా రేవంత్‌రెడ్డి బాధ్యతలు చేపట్టగానే రాజీవ్ ఆరోగ్యశ్రీ పరిమితి రూ. 5 లక్షల నుంచి రూ. 10 లక్షలకు పెంచి ప్రజారోగ్య భద్రతపై ప్రభుత్వానికి వున్న చిత్తశుద్ధిని చాటుకున్నారని తెలిపారు. మన ప్రాంతంలో సీఎం సహాయనిధి, ఎల్‌వోసీల ద్వారా ఇప్పటివరకు రూ.22కోట్ల పైచిలుకు మం జూరు చేసినట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ రొండి రాజు నాయకులు సంద్రగిరి శ్రీనివాస్, చిలుక రమేష్, నాగుల విష్ణు, గూడూరి మధు తదితరులు ఉన్నారు.
ఫ రుద్రంగి : రుద్రంగి మండల కేంద్రంలోని గ్రామపంచాయతీ ఆవరణంలో గురువారం రూ. 4 లక్షల విలువ గల సీఎం సహాయ నిధి చెక్కు లను లబ్ధిదారులకు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పంపీణీ చేశారు.
ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ చెలుకల తిరుపతి, కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు సామ మోహన్‌రెడ్డి, మాజి జడ్పీటీసీ గట్ల మీనయ్య, మాజీ సర్పంచ్ తర్రె ప్రభలత మనోహర్, ఎర్రం గంగనర్సయ్య, గడ్డం శ్రీనివాస్ రెడ్డి, గండి నారాయణ, కెసిరెడ్డి నర్సరెడ్డి, తర్రె లింగం, పల్లి గంగాధర్, ఎర్రం రాజలింగం, సూర యాదయ్య,గండి ఆశోక్ తదితరులు పాల్గొన్నారు.