దేశానికి రోల్‌మోడల్‌గా తెలంగాణ
ABN , Publish Date - Aug 18 , 2025 | 01:02 AM
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలతో తెలంగాణ రాష్ట్రం దేశానికే రోల్ మోడల్‌గా నిలుస్తోందని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు.
వేములవాడ టౌన్, ఆగస్టు 17 (ఆంధ్రజ్యోతి): కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలతో తెలంగాణ రాష్ట్రం దేశానికే రోల్ మోడల్‌గా నిలుస్తోందని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. వేము లవాడ పట్టణంలోని బాల్‌నగర్‌లో ఆదివారం ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారు లు నిర్వహిస్తున్న కడప పూజకు వెళ్లి లబ్దిదారులకు చీర, సారెలను అందజేశారు. ఈ సందర్భంగా ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ పేదలకు ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను సీఎం రేవంత్‌రెడ్డి నాయకత్వంలో ప్రభు త్వం యజ్ఞంలా నిర్వహిస్తుందని అన్నారు. పేదల స్వంత ఇంటి కల ఇప్పుడు ప్రజా ప్రభుత్వంలో నెరవేరుతోందని ప్రజలు ఆనందపడుతు న్నారని తెలిపారు. గత ప్రభుత్వం డుబల్‌బెడ్రూం ఇల్లు కట్టిస్తానని మోసంచేసిందని విమర్శించారు. నియోజకవర్గ వ్యాప్తంగా ఇందిరమ్మ నిర్మాణాలు శరవేగంగా జరుగుతున్నాయని, ఇప్పటికే కొందరికి బేస్మేం ట్ లెవెల్, మరికొందరివి స్లాబ్ దశ వరకు పనులు పూర్తయ్యాయని అన్నారు. తమ ఖాతాల్లో రాష్ట్ర ప్రభుత్వం నిధులను జమచేసిందని గుర్తుచేశారు. నియోజకవర్గంలోని లబ్ధిదారుల ఇంటికి ఏదో ఒక దశలో వెళ్లి చీరె, సారెలను అందజేస్తానని మాట ఇచ్చానని, తప్పకుండా వెళ తానన్నారు. లబ్ధిదారుల కళ్లల్లో ఆనందం చూస్తే ఎన్ని కోట్లు పెట్టినా ఈ సంతోషాన్ని తీసుకురాలేమన్నారు. నిస్సహాయులకు సహాయాన్ని అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం మందుకుపోతుందన్నారు. ఇందిర మ్మ ఇళ్లు పొందిన మహిళల సంతోషం వెళకట్టలేనిదని, గతంలో పూరి గుడిసెల్లో, రేకుల షెడ్లల్లో, చెట్లకింద నివాసమున్న వాళ్లకు ప్రజాప్ర భుత్వం ఇందిరమ్మరాజ్యం లో ఇళ్లు మంజూరు చేసిందని వివరించారు. ఆనాడు నిరుపేదలకు ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చామని, ఈనాడు తామే ఇం దిరమ్మ ఇళ్లు ఇస్తున్నామన్నారు. ప్రజా సంక్షేమ కోసం రాష్ట్ర ప్రభుత్వం నిరంతరం పని చేస్తుందని వివరించారు. ఈ కార్యక్రమంలో కనికరపు రాకేష్, పుల్కం రాజు, ఫోంచెట్టి శంకర్ తదితరులు ఉన్నారు.