బుధవారం బోధనకు ప్రాధాన్యం ఇవ్వాలి
ABN , Publish Date - Oct 08 , 2025 | 11:57 PM
ప్రభుత్వ పాఠశాల్లో బుధవారం బోధన కార్యక్రమానికి ప్రాధాన్యం ఇవ్వాలని కలెక్టర్ పమేలా సత్పతి సూచించారు.
కరీంనగర్ రూరల్, అక్టోబరు 8 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ పాఠశాల్లో బుధవారం బోధన కార్యక్రమానికి ప్రాధాన్యం ఇవ్వాలని కలెక్టర్ పమేలా సత్పతి సూచించారు. కరీంనగర్ రూరల్ మండలం నగునూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలను బుధవారం ఆమె సందర్శించారు. జడ్పీహెచ్‌స్‌లో బుధవారం బోధనలో బాగంగా పదో తరగతి విద్యార్థులు నేర్చుకుంటున్న అంశాలను పరిశీలించారు. ప్రతి విద్యార్థితో ఆంగ్ల పాఠాన్ని చదివించారు. విద్యార్థులుకు క ష్టతరమైన పాఠ్యాంశాలపై బుధవారం బోధనలో దృష్టి పెట్టాలని, శ్రద్ద అంకిత భావంతో నేర్చుకోవాలని సూచించారు. అనంతరం పాఠశాలల్లోని తరగతి గదులు, వంటగది, విటమిన్ గార్డెన్‌ను పరిశీలించారు. ప్రాథిమిక పాఠశాలలో మధ్యహ్న భోజనం నాణ్యతను పరిశీలించారు. భోజనం చేస్తున్న చిన్నారులతో మాట్లాడి ఎలా ఉందని అడిగి తెలసుకున్నారు. అనంతరం నగునూర్ అంగన్‌వాడీ కేంద్రాన్ని, పల్లె దవాఖానాను సందర్శించారు. కార్యక్రమలో డీఎంహెచ్‌వో వెంకటరమణ, ప్రోగ్రాం ఆఫీసర్ సనా, తహశీల్దార్ రాజేష్, ఎంఈవో రవీందర్ పాల్గొన్నారు.