సార్వత్రిక సమ్మెకు మద్దతుగా ఉపాధ్యాయ సంఘాల ర్యాలీ
ABN , Publish Date - Jul 09 , 2025 | 12:23 AM
సార్వత్రిక సమ్మెకు మద్దతుగా యూఎస్‌పీసీ (ఉపాధ్యాయ సంఘాల పోరాట సమితి) ఆధ్వర్యంలో మంగళవారం నగరంలో ర్యాలీ నిర్వహించారు.
గణేశ్‌నగర్, జూలై 8 (ఆంధ్రజ్యోతి): సార్వత్రిక సమ్మెకు మద్దతుగా యూఎస్‌పీసీ (ఉపాధ్యాయ సంఘాల పోరాట సమితి) ఆధ్వర్యంలో మంగళవారం నగరంలో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా యూఎస్‌పీసీ రాష్ట్ర బాధ్యుడు వైద్యుల రాజిరెడ్డి మాట్లాడుతూ కార్మిక వ్యతిరేక చట్టాలను నిరసిస్తూ నిర్వహిస్తున్న సమ్మెను విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో యూటీఫ్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ముల్కల కుమార్, ఎండీ జావిద్, డీటీఎఫ్ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శి ఆవాల నరహరి, చకినాల రామ్మోహన్, టీపీటీఫ్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు రామచంద్రారెడి, వేల్పుల బాలయ్య, రాష్ట్ర మాజీ అధ్యక్షుడు నారాయణరెడ్డి, రఘుశంకర్‌రెడ్డి, డీటీఫ్ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు తూముల తిరుపతి, ఉపాద్యాయ సంఘాల బాధ్యులు పాల్గొన్నారు.