Share News

సీపీఎస్‌ రద్దు చేయాలని ఉపాధ్యాయుల బైక్‌ ర్యాలీ

ABN , Publish Date - Aug 31 , 2025 | 12:56 AM

సీపీఎస్‌ను రద్దు చేయాలి పాత పెన్షన్‌ విధానాన్ని అమలు చేయాలంటూ పీఆర్టీ యూటీఎస్‌ జిల్లా శాఖ ఆధ్వర్యంలో శనివారం జిల్లా కేంద్రంలో ఉపాధ్యాయులు బైక్‌ ర్యాలీ నిర్వహించారు.

సీపీఎస్‌ రద్దు చేయాలని ఉపాధ్యాయుల బైక్‌ ర్యాలీ

సిరిసిల్ల టౌన్‌, ఆగస్టు 30 (ఆంధ్రజ్యోతి) : సీపీఎస్‌ను రద్దు చేయాలి పాత పెన్షన్‌ విధానాన్ని అమలు చేయాలంటూ పీఆర్టీ యూటీఎస్‌ జిల్లా శాఖ ఆధ్వర్యంలో శనివారం జిల్లా కేంద్రంలో ఉపాధ్యాయులు బైక్‌ ర్యాలీ నిర్వహించారు. స్థానిక కొత్తబస్టాండ్‌ నుంచి అంబేద్కర్‌ చౌక్‌ మీదుగా గాంధీచౌక్‌ వరకు ఉపాధ్యాయు ల బైక్‌ ర్యాలీ సాగింది. ఈ సందర్భంగా పీఆర్టీయూటీఎస్‌ జిల్లా అధ్యక్షుడు గన్నమనేని శ్రీనివాసరావు మాట్లాడారు. పాత పెన్సన్‌ విధానాన్ని ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయులందరికి వర్తింప చేయాలని పీఆర్టీయూటీఎస్‌ ఆధ్వర్యంలో పలుమార్లు ప్రభుత్వం, ఉన్నత విద్యాధికారుల దృష్టికి తీసుకెళ్లామన్నారు. కాంగ్రెస్‌ ప్రభు త్వం తమ మేనిఫెస్టోలో పేర్కొన్న విధంగా సీపీఎస్‌ను రద్దు చేసి ఉద్యోగ, ఉపాధ్యాయుల జీవితాల్లో వెలుగులు నింపాలని ముఖ్య మంత్రి రేవంత్‌రెడ్డికి విజ్ఞప్తిచేశారు. సీపీఎస్‌ అంతం పీఆర్టీయూటీఎస్‌ పంతం నినాదంతో 2004 సెప్టెంబర్‌ 1 తర్వాత నియామకమైన ఉద్యో గ ఉపాధ్యాయులకు సీపీఎస్‌ విధానంను రద్దు చేసి పాత పెన్షన్‌ విధా నాన్ని అమలుచేయాలని సెప్టెంబరు 1న చలో హైదరాబాద్‌ ఇందిరా పార్కు వద్ద మహాధర్నాకు ఉపాధ్యాయులను సన్నద్ధం చేస్తూ బైక్‌ ర్యాలీ నిర్వహించామన్నారు. సీపీఎస్‌ రద్దు పాతపెన్షన్‌ విధానం అమ లు కోసం చేపడుతున్న మహాధర్నాకు జిల్లాలోని ఉపాధ్యాయులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో పీఆర్టీయూటీఎస్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎడ్ల కిషన్‌, గౌరవ అధ్యక్షుడు కామినేని శ్రీనివాస్‌, గుర్రం మల్లారెడ్డి, చిప్పయాదగిరి, రాజు, అనిల్‌, మధు, మహేష్‌, నవీన్‌, శ్రీనివాస్‌, షఫీ, ప్రవీన్‌కుమార్‌, రవీందర్‌, పర శురాములు, ఆనంద్‌, మల్లారెడ్డి, ప్రతాప్‌, శ్రీనివాస్‌, తిరుపతిరెడ్డి, పలు మండలాల అధ్యక్ష, కార్యదర్శులు, నాయకులు పాల్గొన్నారు.

Updated Date - Aug 31 , 2025 | 12:56 AM