అంకితభావంతో పనిచేస్తేనే ఉపాధ్యాయులకు గుర్తింపు
ABN , Publish Date - Sep 06 , 2025 | 12:54 AM
అంకితభావంతో పనిచేస్తేనే ఉపా ధ్యాయులకు గుర్తింపు లభిస్తుందని జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర, జాతీయస్థాయి గుర్తిం పునకు ప్రతి ఒక్క ఉపాధ్యాయుడు కృషి చేయాలని ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్నారు.
సిరిసిల్ల కలెక్టరేట్, సెప్టెంబరు 5(ఆంధ్ర జ్యోతి) : అంకితభావంతో పనిచేస్తేనే ఉపా ధ్యాయులకు గుర్తింపు లభిస్తుందని జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర, జాతీయస్థాయి గుర్తిం పునకు ప్రతి ఒక్క ఉపాధ్యాయుడు కృషి చేయాలని ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్నారు. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ జయంతి సందర్భంగా ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా కలెక్ట రేట్‌లోని సమావేశ మందిరంలో శుక్రవా రం జిల్లా విద్యా శాఖ అధ్వర్యంలో ఏర్పా టుచేసిన ఉత్తమ ఉపాధ్యాయుల సన్మాన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కలెక్టరేట్‌లో ముందుగా సర్వేపల్లి రాధాకృష్ణ జయంతి ని పురస్కరించుకుని ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభిం చారు. ఈ సందర్భంగా జిల్లా ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికైన చకినాల శ్రీనివాస్, గుర్రంకృష్ణారెడ్డి, కైరి పద్మ, సీహెచ్ సత్తయ్య, గోలి రాధాకిషన్, అరుకాల బాల్‌రెడ్డి, బోగారపు నవీన్, కట్టరవీం దర్, గోవుల కొండ శ్రీనివాస్, నూగూరి దేవేందర్, నరహరి నాగమ ణి, జంగిటి రాజు, పీచు సుభాష్‌రెడ్డి, గుండమనేని మహేందర్‌రా వు, దిడిగం స్రవంతి, బద్దం రవీందర్, ఓరుగంటి పద్మకళలను కలె క్టర్ సందీప్‌కుమార్ ఝాతో కలిసి విప్ ఆది శ్రీనివాస్ సన్మానిం చారు. అనంతరం జరిగిన సమావేశంలో ఆది శ్రీనివాస్ మాట్లాడు తూ విద్యారంగ అభివృద్ధికి సీఎం రేవంత్‌రెడ్డి నేతృత్వంలో రాష్ట్ర ప్రభుత్వం పక్కా ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళుతోందన్నారు. ఇందులో భాగంగా 11వేల ఉపాధ్యాయ పోస్ట్‌లు భర్తీ చేసిందని, ఉపాధ్యాయులకు పదోన్నతులు కల్పించిందన్నారు. బదిలీలకు అవ కాశం కల్పించిందని వివరించారు. ఉపాధ్యాయ హక్కుల పరిరక్ష ణకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. అన్ని పాఠశాలల్లో వస తులు కల్పించేందుకు నిధులు మంజూరు చేస్తోందన్నారు. రాష్ట్రం లోని ప్రతి నియోజకవర్గంలో రూ.200 కోట్లతో 25 ఎకరాల విస్తీర్ణం లో అన్ని వర్గాల విద్యార్థులకు యంగ్ ఇండియా ఇంటర్నేషనల్ రెసిడెన్షియల్ స్కూల్ కాంప్లెక్స్ రాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తుందన్నారు. అలాగే ఏటీసీ సెంటరులను కూడా మంజూరు చేసిందన్నారు. దీంతో విద్యార్థులు యువతకు వివిధ రంగాల్లో నైపుణ్యత అందిపు చ్చుకునే అవకాశం ఉంటుందని తెలిపారు. మారుతున్న కాలానికి అనుగుణంగా ఉపాధ్యాయులు కూడా సాంకేతిక, నైపుణ్యతను అందిపుచ్చుకోవాలని, విద్యార్థులను తీర్చిదిద్దాలని సూచించారు. ఉత్తమ అవార్డులు పొందిన ఉపాధ్యాయులను స్ఫూర్తిగా తీసుకుని మిగతా ఉపాధ్యాయులు కూడా కృషి చేసి అవార్డులను స్వీకరించాలన్నారు. ఉపాధ్యాయుల అన్ని సమస్యలను పరిష్కరిస్తామన్నారు.
జాతీయ, రాష్ట్ర స్థాయి అవార్డులకు ఎంపిక కావాలి
జిల్లాలోని ఉపాఽధ్యాయులు జాతీ య, రాష్ట్రస్థాయిలో ఉత్తమ ఉపాధ్యా య అవార్డులకు ఎంపిక కావాలని కలెక్టర్ సందీప్‌కుమార్‌ఝా ఆకాంక్షిం చారు. సర్వేపల్లి రాధాకృష్ణ జయంతి సందర్భంగా ఉపాధ్యాయ దినోత్సవా న్ని ప్రభుత్వం నిర్వహిస్తోందని గుర్తు చేశారు. ఉపాధ్యాయులు తాము బోధిస్తున్న పాఠశాలలో విద్యార్థుల సంఖ్య పెంచేలా కృషి చేయా లని, విద్యార్ధులకు సులభమైన రీతిలో పాఠాలను బోధించాలని అన్నారు. విలువలు, క్రమశిక్షణ పాటిస్తూ విద్యార్థులకు ఆదర్శంగా నలువాలని అకాంక్షించారు. పదో తరగతి ఫలితాల్లో రాజన్న సిరిసిల్ల జిల్లాను రాష్ట్ర స్థాయిలో ఐదో స్థానంలో నిలిచిందని, జిల్లా ను ప్రథమ స్థానంలో నిలిపేందుకు ప్రతి ఒక్క ఉపాధ్యాయుడు కృషి చేయాలన్నారు. ప్రభుత్వ విద్యాసంస్థలపై విద్యార్థులు, తల్లిదం డ్రులు నమ్మకం కలిగేలా బోధించాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథ్రాలయ సంస్థ చైర్మన్ నాగుల సత్యనారాయణగౌడ్, సిరిసిల్ల వ్యవసాయ మార్కెట్ కమిటి చైర్‌ప ర్సన్ వెల్ముల స్వరూపతిరుపతిరెడ్డి, వేములవాడ మార్కెట్ కమిటీ చైర్మన్ రాజు, జిల్లా విద్యాధికారి వినోద్‌కుమార్, జిల్లా సంక్షేమాధి కారి లక్ష్మీరాజం తదితరులు పాల్గొన్నారు.