ఉపాధ్యాయ, విద్యారంగ సమస్యలను పరిష్కరించాలి
ABN , Publish Date - Aug 06 , 2025 | 12:29 AM
ఉపాధ్యాయులతో పాటు విద్యారంగ సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించాలని ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ సభ్యులు డిమాండ్ చేశారు.
సిరిసిల్ల కలెక్టరేట్, ఆగస్టు 5(అంధ్రజ్యోతి): ఉపాధ్యాయులతో పాటు విద్యారంగ సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించాలని ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ సభ్యులు డిమాండ్ చేశారు. ఉపాధ్యాయులు బదిలీలు, పదోన్నతుల ప్రక్రియను ఈనెలాఖారులోగా పూర్తిచేయాల న్నారు. కలెక్టరేట్ ఎదుట మంగళవారం ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ (యూఎస్‌పీసీ) ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు పాల్గొని ధర్నా చేపట్టారు. ఈసందర్భంగా యూఎస్‌పీసీ నాయకులు పాతూరి మహేం దర్‌రెడ్డి, గోల్కొండ శ్రీధర్, అయిల్నేని రాజేశ్వర్‌రావు, పర్కాల రవీందర్, దుమాల రామానాథ్‌రెడ్డి, జంగిటి రాజు, విక్కుర్తి అంజయ్యలు మాట్లా డుతూ ఉపాధ్యాయ, విద్యారంగ సమస్యలను ప్రభుత్వం వెంటనే పరి ష్కరించడంతోపాటు బదిలీలు, పదోన్నతులను చేపట్టాల న్నారు. పీఆర్సీని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించి అమలు చేయాలని డిమాండ్ చేశారు. పెండింగ్ డీఏలను వెంటనే చెల్లించాలని, సీపీఎస్‌ను రద్దుచేసి ఓపీఎస్‌ను అమలు చేయాలని, 317 జీవో వలన నష్టపోయిన ఉపాధ్యాయు లందరికి వారివారి సొంత జిల్లాలకు బదిలీలు చేపట్టా లన్నారు. ఉద్యోగ విరమణ పొందిన ఉపాధ్యాయులందరికి పెండింగ్ బకాయిలను వెంటనే చెల్లించాలన్నారు. ఉపా ధ్యాయుల సర్దుబాటు జీవో 25ను సవరించాలని, సమగ్ర శిక్ష ఉద్యోగుల 29రోజుల సమ్మె కాలపు జీతాలను వెంటనే చెల్లించాలన్నారు. టైంస్కేల్ ఇవ్వాలని వివిధ గురుకు లాల్లో విధులు నిర్వహిస్తున్న గెస్ట్, పార్ట్‌టైం అవుట్‌సోర్సిం గ్ ఉపాధ్యాయులకు కనీస వేతనం ఇవ్వాలన్నారు. నూతన జిల్లాలకు జిల్లా విద్యాధికారి పోస్ట్‌లతోపాటు ప్రతి రెవెన్యూ డివిజన్‌కు డిప్యూటీ డీఈవో, నూతన మండలాలకు ఎంఈవో పోస్ట్‌లను మంజూరు చేసి ఉపాధ్యాయుల ఏకీకృత సర్వీసు రూల్స్ రూపొందించి ఖాళీ పోస్ట్‌లను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. ఈ ఽధర్నాలో యూఎస్‌పీసీ నాయకులు అవురం సుధాకర్‌రెడ్డి, వంగ తిరుపతి, శ్రీహరి, గొల్లపల్లి శ్రీనివాస్, పాముల స్వామి, గాలిపెల్లి సం తోష్, కోటగిరి లక్ష్మణ్, ఉపేందర్, ఎం తిరుపతి, రామచంద్రం, చక్ర పాణి, శ్రీనివాస్, ప్రేమ్‌సాగర్, గణేష్, శంకర్, విష్ణు, భాస్కర్, మధు సూధన్, సతీస్ తదితరులు పాల్గొన్నారు.