Share News

ప్రణాళిక ప్రకారం పన్నులు వసూలు చేయాలి

ABN , Publish Date - Dec 10 , 2025 | 12:28 AM

మున్సిపాల్టీల పరిధి లో ఇంటి, నీటి పన్నుల వసూలు ప్రణాళిక ప్రకారం పూర్తి చేయాలని ఇన్‌చార్జి కలెక్టర్‌ గరిమ అగ్రవాల్‌ ఆదేశించారు.

ప్రణాళిక ప్రకారం పన్నులు వసూలు చేయాలి

సిరిసిల్ల కలెక్టరేట్‌, డిసెంబరు 9 (ఆంధ్రజ్యోతి): మున్సిపాల్టీల పరిధి లో ఇంటి, నీటి పన్నుల వసూలు ప్రణాళిక ప్రకారం పూర్తి చేయాలని ఇన్‌చార్జి కలెక్టర్‌ గరిమ అగ్రవాల్‌ ఆదేశించారు. సిరిసిల్ల కలెక్టరేట్‌లో మంగళవారం జిల్లాలోని సిరిసిల్ల, వేములవాడ మున్సిపల్‌ పరిధిలో ఇంటి, నీటి పన్నుల వసూలు, ట్రేడ్‌లైసెన్స్‌, తడి, పొడి చెత్త సేకరణ, వివిధ అభివృద్ధి పనుల పురోగతి, సిబ్బంది, వాహనాల అంశాలపై మున్సిపాలిటీ కమిషనర్‌లు, అధికారులతో జిల్లా ఇన్‌చార్జి కలెక్టర్‌ సమీ క్షించారు. ఈ సందర్భంగా సిరిసిల్ల, వేములవాడ మున్సి పల్‌ పరిధిలో ఇప్పటివరకు ఇంటి, నీటి పన్ను వసూలుపై కమిషనర్‌ లను అడిగి తెలుసు కున్నారు. అధికారులు, సిబ్బందితో ఒక ప్రణాళిక ప్రకారం వసూలు చేయాలని సూచించారు. మున్సిపల్‌ పరిధిలో తడి, పొడి చెత్త సేకరణ, ఎన్ని ట్రాక్టర్లు, ఆటోలు ఉన్నాయి? సెగ్రి గేషన్‌ అంశాలపై వివ రాలు అడిగి తెలుసుకున్నారు. ఇప్పటికే ప్రారం భించిన రోడ్లు, మురికి కాలువలు, జంక్షన్‌ల అభివృద్ధి పనులు త్వరిత గతిన పూర్తి చేయాలని సూచించారు. మున్సిపల్‌ పరిధిలో ఉన్న దుకాణాల వివరాలపై ఆరా తీశారు. ట్రేడ్‌ లైసెన్స్‌, మెప్మా పరిధిలో మహిళా సంఘాల పురోగతిపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సమావేశంలో సిరిసిల్ల, వేముల వాడ మున్సిపల్‌ కమిషనర్లు ఖదీర్‌ పాషా, అన్వేష్‌, డీటీసీపీవో అన్సారీ, డీఈలు, టీపీవోలు తది తరులు పాల్గొన్నారు.

Updated Date - Dec 10 , 2025 | 12:28 AM