‘సైర్’ అప్లికేషన్‌ను సద్వినియోగం చేసుకోవాలి
ABN , Publish Date - Dec 04 , 2025 | 01:18 AM
మొబైల్ ఫోన్లు పోయినా, చోరీకి గురైనా బాధితులందరు సైర్ అప్లికేషన్‌ను సద్వినియోగం చేసుకోవాలని ఎస్పీ మహేష్ బీగీతే అన్నారు.
సిరిసిల్ల రూరల్, డిసెంబరు 3(ఆంధ్రజ్యోతి): మొబైల్ ఫోన్లు పోయినా, చోరీకి గురైనా బాధితులందరు సైర్ అప్లికేషన్‌ను సద్వినియోగం చేసుకోవాలని ఎస్పీ మహేష్ బీగీతే అన్నారు. జిల్లావ్యాప్తంగా పోయిన సుమారు రూ 60లక్షల విలువైన మొ బైల్ ఫోన్‌లను రికవరీ చేసి సిరిసిల్ల జిల్లా పోలీస్ కార్యాలయం లో బుధవారం మొబైల్ ఫోన్ రికవరీ మేళాను ఏర్పాటు చేసి 65 మొబైల్ ఫోన్ల యజమానులకు అందజేశారు. ఈసందర్భం గా ఎస్పీ మాట్లాడుతూ ప్రస్తుత రోజుల్లో మొబైల్ ఫోన్ లేనిదే ఒక చిన్న లావాదేవీ కూడా చేయలేమని, మన విలువైన సమా చారం, బ్యాంక్ అకౌంట్స్, పాస్‌వర్డ్స్ వంటివి మొబైల్‌లో సేవ్ చేసి పెట్టుకుంటారని తెలిసిన నేరగాళ్లు మొబైల్ దొంగిలించి, వీక్ పాస్‌వర్డ్ లను బ్రేక్ చేసి ఫోన్ పే, గూగుల్ పే తదితర మధ్యమాల ద్వారా డబ్బులు కాజేస్తున్నారన్నారు. మొబైల్ ఫోన్ పోగొట్టుకున్న వ్యక్తులు కేవలం మొబైల్ ఫోన్ మాత్రమే కాకుండా తమ వ్యక్తిగత సమాచా రంతో పాటు డబ్బులను కోల్పోతున్నారన్నారు. ఎవరైన మొబైల్ పోగొ ట్టుకున్న లేదా దొంగిలించబడిన వెంటనే సైర్ అప్లికేషన్‌లో బ్లాక్ చేసి, సంబంధిత పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలని కోరారు. ప్రజలు ఎవరైనా సెకండ్‌హ్యాండ్ మొబైల్ ఫోన్‌లను కొనుగోలు చేసినా ఆ దుకా ణయజమాని నుంచి రసీదును తప్పనిసరిగా తీసుకోవాలని సూచించా రు. సెల్‌ఫోన్ దొంగలు దొంగిలించిన ఫోన్‌లను మొబైల్ షాప్‌లలో అమ్ముతున్నారని, తక్కువ ధరకు వస్తుందని దొంగిలించబడిన ఫోన్ అని తెలియక కొనుగోలు చేసి అమాయక ప్రజలు మోసాలకు గురి అవుతున్నారన్నారు. ఎవరైన దొంగిలించబడిన ఫోన్ అని తెలిసి కూడా కొనుగోలు చేస్తే వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయడం జరుగు తుందన్నారు. జిల్లాలో ఇప్పటివరకు సైర్ పోర్టల్ ద్వారా 2183 ఫోన్ లను గుర్తించి సంబంధిత మొబైల్ ఫోన్ల యజమానులకు అందించా మని పేర్కొన్నారు. సైర్ అప్లికేషన్ ద్వారా జిల్లాలో పోయిన మొబైల్ ఫోన్స్‌లను 83 శాతం రికవరీ చేసి బాధితులకు అప్పగించడంలో కృషి చేస్తున్న ఐటీ కోర్ ఎస్‌ఐ కిరణ్ కుమార్, కానిస్టేబుల్ రాజాతిరుమలేష్ లను ఎస్పీ అభినందించారు. పోయిన మొబైల్ ఫోను మళ్లీ దొరకదను కున్న బాధితులు మొబైల్ ఫోన్ జిల్లా పోలీసులు టెక్నాలజీ ఉపయో గించి ఫోన్ రికవరీ చేసి అందించినందుకు జిల్లా ఎస్పీకి, పోలీస్ సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఐటీ కోర్ ఎస్.ఐ కిరణ్ కుమార్, ఆర్‌ఐ యాదగిరి, కానిస్టేబుల్ రాజాతిరుమలేష్ సిబ్బం ది పాల్గొన్నారు.