Share News

ఆరోగ్య మహిళ క్యాంపును సద్వినియోగం చేసుకోవాలి

ABN , Publish Date - Jun 21 , 2025 | 12:19 AM

మహిళలు ఆరోగ్య మహిళ క్యాంపును సద్వినియోగం చేసుకో వాలని డీఎంహెచ్‌వో డాక్టర్‌ వెంకటరమణ అన్నారు.

ఆరోగ్య మహిళ క్యాంపును సద్వినియోగం చేసుకోవాలి

సుభాష్‌నగర్‌, జూన్‌ 20(ఆంఽధ్రజ్యోతి): మహిళలు ఆరోగ్య మహిళ క్యాంపును సద్వినియోగం చేసుకో వాలని డీఎంహెచ్‌వో డాక్టర్‌ వెంకటరమణ అన్నారు. శుక్రవారం స్థానిక బుట్టిరాజారాం కాలనీ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో నిర్వహించిన ఆరోగ్య మహిళ క్యాంపును సందర్శించారు. ఈ సందర్భంగా అక్కడికి వచ్చిన మహిళలతో మాట్లాడారు. వైద్య సేవలు సరిగా అందుతున్నాయా లేదా అని వారిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం సెంటర్‌ రికార్డులు, ఫార్మసీ స్టోర్‌ను పరిశీలించారు. ఎన్‌సీడీ క్లినిక్‌లోని అధిక రక్తపోటు, డయాబెటిక్‌ పేషెంట్లను పరీక్షిస్తున్న విధానం పరిశీలించారు. పేషంట్లకు పంపిణీ చేసిన మందులను, వాటి సంబంధించిన రికార్డులను పరిశీలించారు. అనంతరం ఆరెపల్లి బస్తీ దవాఖానను పరిశీలించారు. ఈ కార్య క్రమంలో పీవోఎంసీహెచ్‌ డాక్టర్‌ సనా జవేరియా, బుట్టి రాజారాం కాలనీ వైద్యాధికారి డాక్టర్‌ లావణ్య, ఆరెపల్లి బసీ దవాఖానా వైద్యాధికారి డాక్టర్‌ రవళి వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - Jun 21 , 2025 | 12:19 AM