సబ్సిడీ స్కీంలను సద్వినియోగం చేసుకోవాలి
ABN , Publish Date - Jul 04 , 2025 | 01:03 AM
కేంద్ర ప్రభుత్వం ద్వారా అందిం చే సబ్సిడీ స్కీంలను సద్వినియోగం చేసుకోవాలని గిరిజన సంక్షేమ శాఖ ప్రోగ్రాం ఆర్గనైజర్స్ శ్యామల, తిరుపతి అన్నారు.
వీర్నపల్లి, జూలై 3 (ఆంధ్రజ్యోతి): కేంద్ర ప్రభుత్వం ద్వారా అందిం చే సబ్సిడీ స్కీంలను సద్వినియోగం చేసుకోవాలని గిరిజన సంక్షేమ శాఖ ప్రోగ్రాం ఆర్గనైజర్స్ శ్యామల, తిరుపతి అన్నారు. వీర్నపల్లి మం డలం సీతారాంనాయక్ తండా గ్రామంలో పీఎం జన జాతీయ గౌరవ్ వర్ష్ వేడుకల్లో భాగంగా దర్తీ ఆబా జన్ భగీదరా అభియాన్ అవగా హన శిబిరాన్ని గురువారం ఏర్పాటుచేశారు. ఈ సందర్భంగా గిరిజ నుల వికాసానికి సంబంధించిన పథకాలపై సంబంధిత శాఖల అధి కారులు క్షేత్రస్థాయిలో గిరిజనులకు వివరించారు. ప్రతిఒక్కరూ ఆర్థిక అభ్యున్నతిని సాధించాలని పిలుపునిచ్చారు. గిరిజనులు అభివృద్ధి చెందడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక సంక్షేమ పథకాలను అం దిస్తున్నట్లు మార్కెట్ కమిటీ చైర్మన్ రాములు నాయక్ పేర్కొన్నారు. అనంతరం ఆధార్ కార్డు, వృద్ధ్యాప్య, వితంతు పింఛన్, రేషన్ కార్డు, వివిధ రకాల దరఖాస్తులను అధికారులు స్వీకరించారు. ఈ కార్యక్ర మంలో ఎమ్మార్వో ముక్తార్ పాషా, ఎంపీడీవో అబ్దుల్ వాజీద్, వ్యవసా య అధికారి జయ, ఐకేపీ ఏపీఎం నర్సయ్య, ఎంఈవో తుమ్మ శ్రీని వాస్, టీజీ బ్యాంక్ మేనేజర్ సంతోష్, ఎంఎల్‌హెచ్‌పీ లక్ష్మీప్రసన్న, ఐసీ డీఎస్ సూపర్‌వైజర్ సంతోషిణి, ఈడీఎం సిబ్బంది శ్యాంకుమార్, అట వీ బీట్ అధికారి వేణు, ఉపాధిహామీ టీఏ అనిత, సీసీ శ్యామల, అంగ న్‌వాడీ టీచర్ మంజుల, పంచాయతీ కార్యదర్శి సుష్మ, వివిధ శాఖల సిబ్బంది, గిరిజనులు పాల్గొన్నారు.