Share News

కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి

ABN , Publish Date - Nov 02 , 2025 | 12:33 AM

ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలను రైతు లు సద్వినియోగం చేసుకోవాలని జగిత్యాల దళారులను నమ్మి మోసపోవద్దని ఆయన రైతులకు సూచించారు.

కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి
మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే సంజయ్‌కుమార్‌

జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్‌ సంజయ్‌కుమార్‌

జగిత్యాలరూరల్‌, నవంబరు1 (ఆంధ్రజ్యోతి) ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలను రైతు లు సద్వినియోగం చేసుకోవాలని జగిత్యాల దళారులను నమ్మి మోసపోవద్దని ఆయన రైతులకు సూచించారు. మార్కెటింగ్‌ ఆధ్వ ర్యంలో జగిత్యాల రూరల్‌ మండ లం లక్ష్మీపూర్‌ గ్రామంలో ఏర్పాటు చేసిన మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని శనివారం జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్‌ సంజయ్‌కుమార్‌ ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సీడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్‌ దాదాపు పూర్తి కావచ్చిందని, నిధుల సమస్య వల్ల ఆలస్యం జరిగిందన్నారు. రాష్ట్ర సీడ్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ దృష్టికి తీసుకెళ్లి సమస్యను త్వరలోనే పరిష్కరిస్తానని తెలిపారు. మక్కలు మద్దతు ధర రూ.2,400 ఉందని, ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయిం చాలని రైతులకు సూచించారు. అకాల వర్షాల వల్ల పంటలు దెబ్బతినడం చాలా బాధాకర మన్నారు.

జగిత్యాల నియోజక వర్గంలో అత్యధిక సామర్ద్యం గోదాంల ఏర్పాటు, మార్క్‌ఫెడ్‌, ఎప్‌సీఐ, వేర్‌హౌస్‌ గోదాంలతో యూరి యా కొరత లేకుండా కృషి చేశానని ఎమ్మెల్యే తెలిపారు. మాక్స్‌ ద్వారా కొనుగోలు కేంద్రం ఏర్పాటుకు తన వంతు కృషి చేస్తానని ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఏఎంసీ చైర్మన్‌ కొలుగూరి దామోదర్‌రావు, నక్కల రవీందర్‌రెడ్డి, నాయకులు రవీందర్‌ రెడ్డి, గంగన్న, జాన్‌, బాలముకుందం, నారాయణరెడ్డి, చంద్రరెడ్డి, రత్నా కర్‌రెడ్డి, రవి, రాజేష్‌, రైతులు తిరుపతిరెడ్డి, గంగన్న పాల్గొన్నారు.

Updated Date - Nov 02 , 2025 | 12:33 AM